Budget 2024 LIVE: అన్ని వర్గాలపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి
Budget 2024 LIVE: మౌలిక సదుపాయల కోసం 11,11,111 కోట్లు ఖర్చు
Budget 2024 LIVE: మహిళల కోసం ఆర్థిక మంత్రి భారీ ప్రకటన
Budget 2024 LIVE: ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు
Budget 2024 LIVE: ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం: నిర్మలా సీతారామన్న
Budget 2024 LIVE: జన్ ధన్ ఖాతాల్లో డబ్బుతో రూ .2.7 లక్షల కోట్లు ఆదా: ఆర్థిక మంత్రి
"అయోధ్య... పురాణాలు చరిత్ర, ఆధ్యాత్మికతతో నిండిన టెంపుల్ సిటీ, రామమందిర ప్రారంభోత్సవంతో ఒక ముఖ్యమైన వేడుకకు వేదికైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్రమైన సరయు నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరం, హిందూ ఇతిహాసం రామాయణం హీరో రాముడి జన్మస్థలంగా కీర్తి పొందుతోంది. శతాబ్దాలుగా, ప్రాచీన కాలం నుంచి వివిధ రాజవంశాలు, వలస పాలన, స్వతంత్ర భారతదేశం ఆధునిక యుగం వరకు భారతీయ చరిత్రలోని విభిన్న కాలాలను ప్రతిబింబిస్తూ అయోధ్య పరిణామం చెందింది. రామమందిరం శతాబ్దాల చిరకాల ఆకాంక్ష. అందుకే ఆలయ ప్రారంభోత్సవం అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది."
1528: రాముడి జన్మస్థలంగా హిందువులు నమ్మే ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మసీదు నిర్మించాడు.
1853: ఈ స్థలం గుర్తింపు విషయంలో మొదటి హిందూ-ముస్లిం ఘర్షణ జరిగింది.
1855-1859: స్థలంపై నియంత్రణకు సంబంధించి చట్టపరమైన వివాదం తలెత్తింది. చివరికి హిందువులు, ముస్లింలు ఇద్దరికీ ప్రవేశాన్ని కల్పించేలా రాజీ మార్గంలో సమస్యకు పరిష్కారం లభించింది.
1885: మసీదు వెలుపల ఉన్న రామ్ చబుత్రాపై గోపురం నిర్మించాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ పిటిషన్ వేశారు. అది తిరస్కరణకు గురైంది.
1949: రాముడు, సీత విగ్రహాలు మసీదు లోపల రహస్యంగా ఉంచారన్న ప్రచారం ఉద్రిక్తతలకు దారి తీసింది.
1950-1959: అక్కడ భూమి అప్పగించాలని పూజలు నిర్వహించాలని కోరుతూ హిందూ సంఘాలు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ వచ్చాయి.
1962: మసీదు తమదేనంటూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది.
1984: ఆ ప్రదేశంలో పూజలు చేసుకోవడానికి హిందువులకు అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ అనుమతించారు. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
1985-86: అయోధ్యలోని 'వివాదాస్పద' స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలని కోరుతూ VHP ఉద్యమాన్ని ప్రారంభించింది.
1990: BJP నాయకుడు ఎల్కే అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్ర ప్రారంభించారు. కానీ దీన్ని బిహార్‌లో ఆపిసి ఆయన్ని అరెస్టు చేసింది అప్పటి ప్రభుత్వం.
1992: బాబ్రీ మసీదుపై కరసేవకులు దాడి చేసి కూల్చివేశారు. ఇది దేశవ్యాప్తంగా మత హింసకు కారణమైంది.
1994: బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు చేసేందుకు లిబర్‌హాన్ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది.
2002లో గుజరాత్‌లో జరిగిన మత ఘర్షణల్లో వేలాది మంది హిందూ, ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.
2002: వివాదాస్పద భూమికి సంబంధించిన వ్యాజ్యాల విచారణను అలహాబాద్ హైకోర్టు ప్రారంభించింది.
2003: భారత పురావస్తు శాఖ ఆ ప్రదేశంలో తవ్వకాలను నిర్వహించింది, మసీదు కింద హిందూ నిర్మాణాలు ఉన్నట్లు ఆధారాలు గుర్తించింది.
2010: వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజించి, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, హిందూ మహాసభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.
2011-2019: అలహాబాద్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా సంఘాలు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
2019: వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం ట్రస్టుకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2020: భూమి పూజ కార్యక్రమంతో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది.
2024: జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం.