ఉత్తర కొరియాలోని మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర పరిశోధకుడు కొన్ని విషయాలు ప్రకటించారు. ఉత్తర కొరియాలో కొన్ని కారణాల వలన అంతర్జాతీయ సమాజానికి దూరంగా ఉంటూ ఒంటరిగా ఉందని చెప్పారు. అయితే ఇది దేశంలోని వ్యక్తుల మానవ హక్కులపై ప్రబావం చూపుతుందని పేర్కొన్నారు.
ఉత్తర కొరియన్లు తమ జీవనోపాధితోపాటు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని యూఎన్ స్వతంత్ర పరిశోధకుడు చెప్పారు. ఆకలితో పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేకాదు రాజకీయ ఖైదీలు కూడా జైల్లలో ఆకలి తీవ్రతను చూస్తున్నారని ఆయన ఎత్తిచూపారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా దాని సరిహద్దులను మూసివేసింది. దేశంలో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సమస్యలు వస్తున్నాయని యూఎన్ పరిశోధకుడు చెబుతున్నారు. సరిహద్దుల మూసివేతతోపాటు అక్కడ క్రూరమైన చర్యలు ఉన్నాయని చెప్పారు. దేశంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లేందుకు ప్రయత్నించే వ్యక్తులను కాల్చే విధానం ఉందని చెప్పారు. సరిహద్దులు మూసివేయడంతో ఎగుమతులు, దిగుమతులు లేవని.. ప్రజలకు జీవనోపాధి కూడా కరవైందని యూఎన్ పరిశోధకుడు చెప్పారు. ఈ కారణంగా సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.
అయితే ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గతంలోనే అధికారికంగా అంగీకరించారు. దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు. కిందటి ఏడాది తుపానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు. ఉత్తర కొరియాలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశ సరిహద్దులు మూసివేయడంతో, దిగుమతులు కూడా లేక ఆ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. చైనాతో వ్యాణిజ్య సంబంధాలు తగ్గిపోయాయి. దీనికి తోడు అక్కడ చేపడుతున్న అణు కార్యక్రమాల కారణంగా ఆ దేశం అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటోంది.
Also Read: Burj Khalifa: తెలంగాణ బతుకమ్మకు అరుదైన గౌరవం.. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శన
Also Read: Hypersonic Missile Test: చైనా దూకుడుపై బైడెన్ టెన్షన్.. ఆ క్షిపణి ప్రయోగంపై ఆందోళన!
Also Read: Hong Kong Bacterial Infection: చేపలతో జాగ్రత్త గురూ.. వైరస్, ఫంగస్ అయిపోయింది ఇక బ్యాక్టీరియా వంతు!
Also Read: Insomnia: నిద్ర సరిగా పట్టడం లేదా... అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే
Also Read: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?