కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం భయపడింది.. భయపడుతూనే ఉంది. ఈ వైరస్ ప్రభావం మన జీవితాలపై ఎంత ఎఫెక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ సహా మరిన్ని అంటురోగాలతో అసలు ప్రపంచం ఏమైపోతుందో అనిపించింది. ఉన్నవి చాలదన్నట్లు ప్రపంచాన్ని భయపెట్టడానికి మరో బ్యాక్టీరియా రెడీ అయింది. అవును.. మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం హాంకాంగ్‌ను ఈ బ్యాక్టీరియా హడలెత్తిస్తోంది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో!


హాంకాంగ్ చేపల మార్కెట్..


హాంకాంగ్‌ ప్రజలు ప్రస్తుతం ఓ ప్రమాదక బ్యాక్టీరియాకు భయపడుతున్నారు. ఓ ఫ్రెష్ వాటర్ చేప నుంచి ఈ బ్యాక్టీరియా వెలువడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాంకాంగ్‌లో రద్దీగా ఉండే మార్కెట్లలో చేపలను ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన గ్రూప్ బీ స్ట్రెప్టోకోక్కస్ బ్యాక్టీరియాను ఇటీవల కొంతమందిలో గుర్తించారు.  2021 సెప్టెంబర్- అక్టోబర్ నెలలో ఇలాంటివి దాదాపు 79 కేసులు నమోదయ్యాయి. ఈ బ్యాక్టీరియా కారణంగా ఇప్పటికే ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. 


ఈ ఎస్టీ283 బ్యాక్టీరియా తాజాగా 32 మందికి సోకినట్లు సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ (సీహెచ్‌పీ) వెల్లడించింది. గత నెలలో ఈ కేసులు 26 నమోదుకాగా ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగింది. ఈ కేసులకు సున్ వాన్‌లోని ఓ చేపల మార్కెట్‌కు సంబంధముందని అధికారులు గుర్తించారు.


ఈ బాధితులందరూ ఏదో ఒక సమయంలో ఆ మార్కెట్‌లోని చేపలను పట్టుకున్నట్లు తేలింది. అందులోనూ ముఖ్యంగా ఫ్రెష్ వాటర్ ఫిష్, గ్రాస్ కార్ప్‌ అనే చేపలను పట్టుకోవడం వల్లే ఈ బ్యాక్టీరియా సోకినట్లు చెబుతున్నారు. 


ఏంటీ బ్యాక్టీరియా?



  1. గ్రూప్ బీ స్ట్రెప్టోకోక్కస్‌ బ్యాక్టీరియా సాధారణంగా పేగులు, మూత్ర సంబంధిత భాగాలు, రిప్రోడెక్టివ్ గ్రంధులలో కనిపిస్తాయి.

  2. అయితే ఈ బ్యాక్టీరియా వల్ల ఆరోగ్యవంతులకు ఏమీ కాదు. లక్షణాలు కూడా ఏం కనిపించవు. కానీ రక్తం, ఎముకలు, ఊపిరితిత్తులు, మెదడు, వెన్నెముకలో ఇది అంటువ్యాధులను సృష్టించగలదు. 

  3. అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు ఇది చాలా ప్రమాదకరం. అలానే తీవ్రమైన రోగాలతో బాధపడే వారికి ఈ బ్యాక్టీరియాతో ప్రమాదం ఉంది.

  4. న్యూమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్, బ్లడ్ ఇన్‌ఫెక్షన్స్, స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ రావడం వీటి లక్షణాలు. 


ఈ బ్యాక్టీరియా కారణంగా వైద్యులు, నిపుణులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. రా సీ ఫుడ్స్‌ను  తినొద్దంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో కూడా ఈ వార్త వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోను పలు రోగుల్లో ఈ బ్యాక్టీరియాను గుర్తించినట్లు ఈ పత్రిక పేర్కొంది. గురువారం మరో 9 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం బ్యాక్టీరియా కేసుల సంఖ్య 88కి పెరిగింది.


Also Read: Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి