చైనా చేస్తోన్న హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల చైనా రహస్యంగా అణ్వస్త్ర సామర్థ్యమున్న హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించి అమెరికాకు షాకిచ్చింది. బ్రిటన్‌కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఈ కథనం ప్రచురించింది.


అయితే ఈ వార్తలను చైనా ఖండించింది. తాము కేవలం హైపర్ సోనిక్ క్షిపణులను మాత్రమే ప్రయోగించామని అణ్వస్త్ర సామర్థ్యమున్నవి కాదని వాదించింది.


ఆ వార్తల ప్రకారం..


అణ్వ‌స్త్ర సామ‌ర్థ్య‌మున్న ఓ హైప‌ర్‌ సోనిక్ క్షిప‌ణిని చైనా ఇటీవల ప‌రీక్షించింది.  ఈ క్షిప‌ణి భూక‌క్ష్య‌కు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదించగలదు.  అయితే, చైనా ప్ర‌యోగించిన ఈ క్షిప‌ణి కొద్దిలో గురితప్పిన‌ప్ప‌టికీ, అమెరికా క‌న్నుగ‌ప్పి ఈ క్షిప‌ణిని డ్రాగన్ ప్ర‌యోగించింది. భూక‌క్ష్య‌కు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావ‌డం అంటే మాములు విష‌యం కాదు. ఈ హైప‌ర్ సోనిక్ క్షిప‌ణి అమెరికా మీద నుంచి కూడా ప్ర‌యాణం చేసి ఉండ‌వ‌చ్చు.  


ధ్వని కంటే వేగం..


ఈ క్షిప‌ణులు ధ్వ‌నివేగం కంటే 5 రెట్లు వేగంగా ప్ర‌యాణం చేయగలవు. గంట‌కు సుమారు 6200 కిమీ వేగంతో ఈ క్షిప‌ణులు ప్ర‌యాణం చేస్తాయి.  బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను ఒక‌సారి ప్ర‌యోగిస్తే వాటిని మ‌ధ్య‌లో నియంత్రించ‌డం కుద‌ర‌దు.  కానీ, ఈ హైప‌ర్ సోనిక్ క్షిప‌ణుల‌ను మ‌ధ్య‌లో నియంత్రించే అవ‌కాశం ఉంటుంది.  


వారి దగ్గరే ఉన్నాయి..


ప్ర‌స్తుతం ఇలాంటి హైప‌ర్‌సోనిక్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌లు ర‌ష్యా, చైనా, అమెరికా, ఉత్త‌ర కొరియా దేశాల వ‌ద్ధ మాత్ర‌మే ఉంది. భారత్, జ‌పాన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ ప్ర‌స్తుతం వీటిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. అయితే ర‌ష్యా త‌యారు చేసిన హైప‌ర్‌సోనిక్ క్షిప‌ణి ధ్వ‌ని కంటే 27 రెట్ల వేగంతో ప్ర‌యాణం చేయ‌గ‌ల‌దు. 


Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ


Also Read: Overthinking Impact: అతిగా ఆలోచిస్తున్నారా? అయ్యయ్యో వద్దమ్మ.. బుజ్జి లైఫ్ ఇది.. ఇలా బతికేయండి!


Also Read: Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి