Breaking News Live:ప్రేమ విఫలమైందని పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
AP Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
తిరుపతి కొర్లగుంటలో ప్రేమ విఫలం కావడంతో ప్రేయసి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్ధానికులను ఆందోళనకు గురి చేసింది. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న యువకుడిని చూసి మంటలను స్థానికులు అదుపు చేశారు. బాధితుడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సగానికి పైగా శరీరం కాలి పోవడంతో యువకుడి పరిస్ధితి విషమంగా ఉంది. యువకుడు వివరాలు తెలియాల్సి ఉంది..
కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఒంగోలు జైలర్‍గా పంపించింది. కడప జైలర్‍గా ఒంగోలు జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ నియమించింది.
వివేకా హత్య కేసు అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీ మహేష్ కుమార్ కలిశారు. సీబీఐ అధికారులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఉదయ్ కుమార్ రెడ్డి. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము చెప్పినట్లు వినాలని సిబిఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా రైల్వేస్టేషన్ మార్గంలో తల్లి, కూతురుపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. ఇనుప రాడ్ తో బలంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయారు. స్థానికులు ఆటో సహాయంతో టెక్కలి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. జండా పేట గ్రామానికి చెందిన యమున, తల్లి తిప్పన జగదంబ ఉదయం 8 గంటలకు పలాసలో ఉన్న తమ బంధువులు ఇంటికి వెళ్లాలని బస్ ఎక్కేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఇనుప రాడ్ తో దాడి చేసి ఇద్దరి వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగులు, సెల్ ఫోన్లు తీసుకొని పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kishan Reddy Criticises Telangana CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పాకిస్తాన్ కంటే దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు శత్రువులు లేరని.. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి శత్రువులు కేవలం పాకిస్తాన్ మాత్రమే అన్నారు. తమకు రాజకీయ పార్టీలు శత్రువులు కావని, కేవలం ప్రత్యర్థులు మాత్రమే అని పేర్కొన్నారు. మాపైన సర్జికల్ స్ట్రక్ జరిగిందని పాకిస్తాన్ స్వయంగా చెప్పిందన్నారు. దీనిపై వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సైనికులను అవమన పరిచే తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు ఉన్నాయని చెప్పారు. సైనికుల ఆత్మవిశ్వాసన్నీ దెబ్బతీసేవిధంగా కేసీఆర్ మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి సినీ నటుడు అలీ వచ్చారు. 3 గంటలకు సీఎం జగన్‌తో అలీ సమావేశం కానున్నారు. వైకాపా నేతగా గత ఎన్నికల్లో పార్టీ విజయానికి విస్తృత ప్రచారం చేశారు అలీ. అలీకి వైకాపా తరపున రాజ్య సభ సీటు ఇస్తారని ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో సీఎంతో అలీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
తనను కలవడానికి రమ్మని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలిచారని నందమూరి బాలకృష్ణ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే తాను రాను అని బాలయ్య బదులిచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను సినిమా బడ్జెట్ పెంచనని, సీఎం జగన్‌ను కలవనని చెప్పినట్లుగా సమాచారం. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే తాను నటించిన అఖండ సినిమా సక్సెస్ అయ్యిందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ సవాంగ్‌పై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఏపీ నూతన డీజీపీ నియామకం, గౌతమ్ సవాంగ్ బదిలీపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం పోలీస్ నియామకంపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో నూతన డీజీపీని నియమించినట్లు తెలుస్తోంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు అధికారులు. సొమాలీయన్ దేశస్థుడి వద్ద 30 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్ గుర్తించి పట్టుకున్నారు సీఐఎస్ ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు. షార్జా వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు మహమూద్ ఆలీ అనే ప్రయాణీకుడు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశాడు. ఆయనపై అనుమానంతో బ్యాగ్ చెక్‌చేస్తే అసలు సంగతి వెలుగు చూసింది. దాచిన విదేశీ కరెన్సీ గుట్డును రట్టు చేసింది భద్రతా సిబ్బంది. అతని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు షర్మిల అందోళన చేపట్టారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారామె. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి జనార్దన్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తల రాకతో టీఎస్పీఎస్సీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేాశారు. టిఎస్పీఎస్సి కార్యాలయం ముందు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
శ్రీకాకుళం జిల్లా: అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం
పాలకాండ మండలం చిన్న మంగళాపురం గ్రామంలో అప్పుల భాద తాళలేక నాగవరపు రామారావు(43), నాగవరపు తవిటమ్మ (39) భార్య భర్తలు ఆత్మహత్యామత్నం చేశారు. భర్త మృతి, బార్య తవిటమ్మ పరిస్టతి విషమం.. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికు తరలించారు. ఇటుకుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Hyderabad police file FIR against Assam CM: అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు సెక్షన్ల కింద అస్సాం సీఎంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మా అధ్యక్షుడు మంచు విష్ణు సమావేశం కానున్నారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్, మంచు విష్ణు భేటీ కాబోతున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత. సోమాలియా దేశస్థుడి వద్ద 30 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్ గుర్తించిన సీఐఎస్ ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు. షార్జా వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మహమూద్ ఆలీ అనే ప్రయాణీకుడు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్ ను లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేయగా బ్యాగ్ లో దాచిన విదేశీ కరెన్సీని భద్రతా సిబ్బంది గుర్తించారు. ప్రయాణికుడ్ని అరెస్ట్ చేయడంతో పాటు ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు.
Background
Telangana Breaking News Live Updates: కరోనా వ్యాప్తితో చిత్తూరు జిల్లా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేటి నుంచి పునః ప్రారంభించింది. ఈ తెల్లవారు జామున 5 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్లైన్ ద్వారా భక్తులకు జారీ చేసింది. రోజుకు పది వేల టికెట్ల చోప్పున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో ఉచిత దర్శనం టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. నిన్న ఏపీలో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు తూర్పు దిశ, ఈశాన్య దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు అలాగే ఉంటాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత మరికొన్ని రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొనసాగనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో నేడు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో ఆకాశాన్ని మేఘాలు దట్టంగా కప్పేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. తెలంగాణలో తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉండగా, పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కానున్నాయి.
వరుసగా వారం రోజులు పెరిగిన బంగారం ధర నేడు దిగొచ్చింది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.550 మేర తగ్గడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.50,510 అయింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.1,200 మేర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.68,600 కు ఎగబాకింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధరలు నేడు తగ్గాయి. విజయవాడలో రూ.510 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 15th February 2022) తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,500 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300కి పతనమైంది. విజయవాడలో వెండి 1 కేజీ ధర రూ.68,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ఇంధన ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉంది.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది. 19 పైసలు పెరగడంతో వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, 21 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.31 కి తగ్గింది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) భారీగా పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 15th February 2022)పై 22 పైసలు తగ్గడంతో నేడు లీటర్ ధర రూ.110.29 కాగా, ఇక్కడ డీజిల్ పై 23 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.36 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -