Royal Enfield Goan Classic 350: బ్రిటిష్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లో కొత్త 350 సీసీ బైక్‌ను విడుదల చేసింది. దీనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 అని పేరు పెట్టారు. నవంబర్‌లోనే ఈ బైక్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇది జే ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐదో మోటార్‌సైకిల్.


రెట్రో థీమ్ ఆధారంగా ఈ బైక్ రూపొందింది. సాధారణ క్లాసిక్ 350తో పోలిస్తే చాలా మార్పులను కలిగి ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 2.35 లక్షలుగా నిర్ణయించారు. ఈ మోటార్‌సైకిల్ నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌ల్లో పరిచయం చేయబడింది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 బైక్‌ను సాధారణ క్లాసిక్ 350 ఆధారంగా రూపొందించారు. అయితే ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఇందులో సబ్‌ఫ్రేమ్‌ను అందించబోవడం లేదు. దీనికి బదులుగా రిమూవ్ చేయగల పిలియన్ సీటు, బాబర్ స్టైల్ ఓవర్‌హాంగ్ సీటుతో వస్తుంది.



Also Read: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ కారు వచ్చేసింది - మహీంద్రా బీఈ 6ఈ ధర ఎంత?


రాయల్ ఎన్‌ఫీల్డ్ గోన్ క్లాసిక్ ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లను కలిగి ఉంది. దీని వల్ల బైక్ రెట్రోగా కనిపిస్తుంది. ఇది ముందు వైపు 19 అంగుళాల చక్రాలు, వెనుక వైపు 16 అంగుళాల చక్రాలను కలిగి ఉంది. బైక్ పొడవు 2,130 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1200 మిల్లీమీటర్లుగా ఉంది. ఇది కాకుండా 1400 మిల్లీమీటర్ల పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది.


ట్యూబ్‌లెస్ వైర్ స్పోక్ వీల్స్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ టైర్లపై కొత్త వైట్ వాల్ కలర్ ఉపయోగించారు. ఈ బైక్‌లో టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్‌లు, రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 


రాయల్ ఎన్‌ఫీల్డ్ గోన్ క్లాసిక్ ఇంజిన్ ఎలా ఉంది?
ఇంజిన్ గురించి చెప్పాలంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350లో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 20 బీహెచ్‌పీ, 27 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయిన ఈ ఇంజన్ చాలా శక్తివంతమైనది. మీరు మోటార్‌సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ని కూడా చూడవచ్చు. ఇది డిస్క్ బ్రేక్‌లతో కూడిన డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.



Also Read: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?