Realme V60 Pro Launched: రియల్‌మీ వీ60 ప్రో చైనాలో లాంచ్ అయింది. ఇది కంపెనీ వీ సిరీస్ లైనప్‌లో మార్కెట్లోకి వచ్చింది. కొత్త రియల్‌మీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ కానుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5600 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 


రియల్‌మీ వీ60 ప్రో ధర (Realme V60 Pro Price)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.18,600) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.21,000) నిర్ణయించారు. లక్కీ రెడ్, రాక్ బ్లాక్, ఆబ్సిడియన్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనదేశంలో బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.



Also Read: సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?


రియల్‌మీ వీ60 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందిస్తారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 625 నిట్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రియల్‌మీ వీ60 ప్రో రన్ కానుంది. 12 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉండనుంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ర్యామ్‌ను వర్చువల్‌గా 24 జీబీ వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు సెకండరీ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5600 ఎంఏహచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.



Also Read: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!