Redmi K80 Series Launched: రెడ్‌మీ కే80 సిరీస్ స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్‌లో రెడ్‌మీ కే80, రెడ్‌మీ కే80 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లపై ఈ రెండు ఫోన్లు పని చేయనున్నాయి. 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలతో రెడ్‌మీ కే80 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్‌మీ కే80 ప్రోలో అదనంగా 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో లెన్స్‌ను అందించారు. బేస్ మోడల్లో ఈ లెన్స్ లేదు. సెక్యూరిటీ కోసం అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు.


రెడ్‌మీ కే80 ధర
ఇందులో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.29,000) ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,599 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.42,000) నిర్ణయించారు. మౌంటెయిన్ గ్రీన్, మిస్టీరియస్ గ్రీన్ బ్లాక్, స్నో రాక్ వైట్, ట్విలైట్ మూన్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ కే80 ప్రో ధర
ఇందులో కూడా నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.43,000) నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,799 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.56,000) ఉంది. మౌంటెయిన్ గ్రీన్, మిస్టీరియస్ నైట్ బ్లాక్, స్నో రాక్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ కే80 ప్రోలో ఛాంపియన్స్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర 4,999 యువాన్లుగా (సుమారు రూ.58,000) ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుందని సమాచారం. లాంచ్ అయితే ధర చైనా రేట్ల కంటే కాస్త ఎక్కువగా ఉండవచ్చు.



Also Read: 5000 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్... రెండిట్లో ఏ బ్యాటరీ ఆప్షన్ బెస్ట్!


రెడ్‌మీ కే80, కే80 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
రెడ్‌మీ కే80 సిరీస్‌లో ఉన్న రెండు ఫోన్లలోనూ 6.67 అంగుళాల 12 బిట్ 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్, 2160 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఫీచర్లు ఈ డిస్‌ప్లేలో ఉన్నాయి. రెడ్‌మీ కే80లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, రెడ్‌మీ కే80 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అందించారు. రెండు ఫోన్లలోనూ 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందుబాటులో ఉంది. షావోమీ హైపర్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రెండు ఫోన్లూ పని చేయనున్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... రెడ్‌మీ కే80లో ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 ప్రైమరీ కెమెరాను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. రెడ్‌మీ కే80 ప్రోలో పైన ఉన్న రెండు సెన్సార్లతో పాటు అదనంగా 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో లెన్స్ కూడా ఉంది.


రెండు ఫోన్లలోనూ యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.4, వైఫై 7, 5జీ, 4జీ వోల్టే సపోర్ట్ కూడా ఉండనుంది. అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అందించారు. రెడ్‌మీ కే80 బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 120W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. రెడ్‌మీ కే80 ప్రోలో 6550 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.



Also Read: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?