Smartphone Battery: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. సోషల్ మీడియాను వాడాలన్నా, గేమింగ్ చేయాలన్నా, ఆఫీస్ వర్క్ చేయాలన్నా స్మార్ట్ ఫోన్ చాలా ముఖ్యం. స్మార్ట్ ఫోన్ పని చేయాలంటే బ్యాటరీ సామర్థ్యం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఇప్పుడు కొత్త ఫోన్ కొనాలనుకునే వారు 5000 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్‌ల్లో ఏది కొనాలని గందరగోళానికి గురవుతారు. మీకు ఏ ఆప్షన్ సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం.


5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ల వల్ల లాభాలు...
5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్లను బ్యాలన్స్‌డ్ ఫోన్లు అని చెప్పవచ్చు.ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై ఒకటి నుంచి ఒకటిన్నర రోజు వరకు ఉంటుంది. ఇది సాధారణ వినియోగం కోసం సరిపోతుంది.


ప్రయోజనాలు ఇవే...
ఈ బ్యాటరీ ఉన్న ఫోన్లు తేలికగా ఉంటాయి. డిజైన్ స్లిమ్‌గా ఉంటుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటాయి


ఇది ఎవరికి సరైనది...
సాధారణ వినియోగం కోసం లైట్, స్లిమ్ ఫోన్ కావాలనుకునే వారికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు బెస్ట్ అని చెప్పవచ్చు.



Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!


6000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్ల వల్ల లాభాలు...
6000 ఎంఏహెచ్ బ్యాటరీ మరింత శక్తివంతమైనది. ఎక్కువ కాలం మన్నుతుంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, తరచుగా ఇంటర్నెట్ ఉపయోగించే హెవీ యూజర్ల కోసం ఈ బ్యాటరీ ఆప్షన్ ఉత్తమం.


ప్రయోజనాలు ఇవే...
సుదీర్ఘ బ్యాటరీ జీవితం (2 రోజుల వరకు వస్తుంది)
హెవీ యూసేజ్‌కు అనుకూలం
లాంగ్ జర్నీల్లో బాగా ఉపయోగపడుతుంది.


ఇది ఎవరికి సరైనది...
6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు రోజంతా ఎక్కువగా ఫోన్‌ని ఉపయోగించే వారికి బెస్ట్ ఆప్షన్.


ఏ ఆప్షన్‌ను ఎంచుకుంటే బెస్ట్?
మీరు లైట్, పోర్టబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తూ... సాధారణ అవసరాల కోసం స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారయితే 5000 ఎంహెచ్ బ్యాటరీ బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా మీరు సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు సరైనది. కాబట్టి మీరు ఏ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.


Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!