5G Smartphone Under Rs 15k: చాలా కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం రూ.15,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో రెడ్‌మీ నుంచి రియల్‌మీ వరకు అన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు మంచి పనితీరుతో పాటు బలమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్లను కూడా అందిస్తాయి. మీరు రూ. 15,000 లోపు మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇందులో బెస్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై మీకు బంపర్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.


రియల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G)
ఈ రియల్‌మీ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 8 జీబీ వరకు ర్యామ్‌ని కలిగి ఉంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. అదే సమయంలో ఫోన్ 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇది కాకుండా మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అమెజాన్‌లో రూ. 1500 వరకు తగ్గింపు కూడా పొందుతారు.


Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!


శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ (Samsung Galaxy M15 5G)
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీలో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ. 14,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే అందుబాటులో ఉంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌ను కూడా చూడవచ్చు. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 1000 తగ్గింపు కూడా లభిస్తుంది.


రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G)
రెడ్‌మీ 12 5జీలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 13,998కి లిస్ట్ అయిది. దీంతో పాటు మీరు దీనిపై రూ. 1000 కూపన్ డిస్కౌంట్‌ను కూడా పొందుతారు.


రియల్‌మీ 12 5జీ (Realme 12 5G)
రియల్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌లో వెనకవైపు కెమెరాల్లో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఇందులో 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ.14,699గా ఉంది. అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు తగ్గింపు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌పై అందించనున్నారు.


ప్రస్తుతం మనదేశంలో ఈ ధరలో స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. త్వరలో ఈ ధరలో మరిన్ని స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!