BSNL New Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను పెంచడంతో ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితిలో బీఎస్ఎన్ఎల్ కూడా దేశంలో తన నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరిస్తోంది. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీని అందించే రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
బీఎస్ఎన్ఎల్ రూ.999 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. ఇది అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఇది కాల్ చేయడానికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా సౌకర్యం అందుబాటులో లేదు. ప్రధానంగా కాల్ చేయడానికి ప్లాన్ల కోసం చూసే వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్లాన్
రూ. 997 ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్, ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తున్నారు. ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కాలింగ్, డేటా సేవలు రెండూ అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉత్తమమైనది.
Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!
జియో, ఎయిర్‌టెల్‌తో బీఎస్ఎన్ఎల్ పోటీ...
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు బీఎస్ఎన్ఎల్ లాగా 200 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను అందించవు. బీఎస్ఎన్ఎల్ సరసమైన ధరలు, సుదీర్ఘ వ్యాలిడిటీతో మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించింది.
ట్రాయ్ సూచనలు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అన్ని టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్ కవరేజ్ సమాచారాన్ని జియోస్పేషియల్ మ్యాప్‌ల ద్వారా ప్రచురించేలా చూసుకోవాలని ఆదేశించింది. ఈ మ్యాప్‌లలో 2జీ, 3జీ, 4జీ, 5జీ సేవల లభ్యతను స్పష్టంగా చూపించడం తప్పనిసరి అయింది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ చవకైన, దీర్ఘకాలిక ప్లాన్లు తక్కువ ధరలో గొప్ప సేవలను కోరుకునే వినియోగదారులను ఆకర్షిస్తాయి. బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సర్వీసులను కూడా లాంచ్ చేయనుందని సమాచారం. ఇది లాంచ్ అయితే వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!