Lava Yuva 4 Launched: లావా యువ 4 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. యూనిసోక్ టీ606 చిప్‌సెట్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్క భాగంలో అందించారు. రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి కేవలం ఆఫ్‌లైన్‌లోనే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన లావా యువ 3కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
లావా యువ 4 ధర (Lava Yuva 4 Price in India)
ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.6,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. గ్లాసీ బ్లాక్, గ్లాసీ పర్పుల్, గ్లాసీ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. లావా యువ 4 స్మార్ట్ ఫోన్‌పై ఒక సంవత్సరం వారంటీతో పాటు ఉచితంగా హోం సర్వీసింగ్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రిటైల్ ఫస్ట్ స్ట్రాటజీ కారణంగా లావా యువ 4ను మొదట కంపెనీ ఆఫ్‌లైన్‌లోనే విక్రయించనుంది.
Also Read: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
లావా యువ 4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Lava Yuva 4 Specifications)
లావా యువ 4లో 6.56 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై లావా యువ 4 రన్ కానుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ముందువైపు ఉన్న పంచ్ హోల్ స్లాట్‌లో సెల్ఫీ కెమెరా కనిపించనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్క భాగంలో అందించారు. ప్రీమియం తరహాలో గ్లాసీ బ్లాక్ డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
లావా అనే భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్. 2010వ దశకంలో లావా మనదేశంలో చవకైన స్మార్ట్ ఫోన్లను విక్రయించేది. కానీ చైనాకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల రాకతో లావా ఫోన్లు మరుగున పడ్డాయి. కానీ ఇటీవలే మళ్లీ తిరిగి లావా స్మార్ట్ ఫోన్లు తీసుకు రావడం మొదలు పెట్టింది. ఈ ఫోన్లకు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే లావా యువ 4 కూడా మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: 5000 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్... రెండిట్లో ఏ బ్యాటరీ ఆప్షన్ బెస్ట్!