Honda Shine Vs Bajaj Platina: ఈ రోజుల్లో ప్రజలు తక్కువ ధరలో మంచి మైలేజీని ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మెరుగైన మైలేజీ ఇస్తాయని పేరున్న అనేక బైక్‌లు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ముందుండే బైక్‌లు బజాజ్ ప్లాటినా, హోండా షైన్ . ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్ బైక్? ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుందో తెలుసుకుందాం.
బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100లో 102 సీసీ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.9 పీఎస్ పవర్‌తో 8.3 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలుగా ఉంది. ఈ బైక్‌లో డ్రమ్ బ్రేక్‌లు అందించారు.
దీనితో పాటు ఇది 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కూడా పొందుతుంది. డీఆర్ఎల్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, 200 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ బైక్‌లో ఉన్నాయి.
Also Read: రూ.80 వేలలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - హోండా, హీరో, టీవీఎస్, ఎలక్ట్రిక్ కూడా!
హోండా షైన్
హోండా షైన్ బైక్ గురించి చెప్పాలంటే... ఈ బైక్ శక్తివంతమైన 123.94 సీసీ 4 స్ట్రోక్ ఎస్ఐ బీఎస్-VI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 7,500 ఆర్పీఎం వద్ద 7.9 కేడబ్ల్యూ శక్తిని, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ బైక్ ఐదు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది.
బజాజ్ ప్లాటినా, హోండా షైన్‌లలో ఏది బెటర్?
బజాజ్ ప్లాటినా 100ని అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్‌లలో ఒకటిగా అందరూ పరిగణిస్తారు. బజాజ్ ప్లాటినా 100 లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా షైన్ లీటరు పెట్రోలుకు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లుగా ఉంది. ఒక్క ట్యాంక్ ఫిల్‌పై హోండా షైన్ 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
Also Read: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!