Best Scooters Under Rs 80000 in India: ప్రస్తుతం మనదేశంలో చాలా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం విభాగంలోనే కాకుండా ఎంట్రీ విభాగంలో కూడా చాలా కాంపిటీషన్ ఉంది. తక్కువ ధరలో కూడా మంచి మైలేజీని ఇచ్చే, అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్కూటీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.80 వేలలోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్కూటీలు ఏవో చూద్దాం. టీవీఎస్, హోండా, హీరో వంటి పాపులర్ కంపెనీల స్కూటీలు కూడా ఇందులో ఉన్నాయి.
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
టీవీఎస్ జూపిటర్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.73,700 నుంచి రూ.87,250 మధ్యలో ఉంది. ఇందులో 113.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 7.91 హెచ్‌పీ పవర్‌ను, 9.8 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనుంది. సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఈ స్కూటీ లాంచ్ అయింది. లీటరు పెట్రోలుకు 45 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇది అందిస్తుందని కంపెనీ అంటోంది.
హోండా డియో (Honda Dio)
హోండా డియో ఎక్స్ షోరూం ధర రూ.71,212 నుంచి రూ.78,162 మధ్య ఉంది. ఇందులో 109.51 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 7.75 హెచ్‌పీ పవర్‌ను, 9.03 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనుంది. సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఈ స్కూటీ అందుబాటులో ఉంది. దీని మైలేజీ 50 కిలోమీటర్ల వరకు ఉండటం విశేషం.
Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
హీరో డెస్టినీ ప్రైమ్ (Hero Destini Prime)
హీరో డెస్టినీ ప్రైమ్ కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.71,499గా ఉంది. 109.51 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. ఇది 7.75 హెచ్‌పీ పవర్‌ను, 9.03 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనుంది. సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఈ స్కూటీ మార్కెట్లోకి రానుంది. ఈ బైక్ లీటర్‌కు 50 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.
ఒకినావా ఆర్30 (Okinawa R30)
ఈ లిస్ట్‌లో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీని ఎక్స్ షోరూం ధర రూ.61,998గా ఉంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 250 వాట్ల పీక్ పవర్‌ను జనరేట్ చేయనుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్ల వరకు ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల రేంజ్‌ని ఇది అందించనుంది.
యాంపియర్ రియో (Ampere Rio)
ఈ జాబితాలో ఉన్న రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపియర్ రియో. ఎల్ఏ ప్లస్, ఎల్ఐ ప్లస్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటిలో ఎల్ఏ ప్లస్ ఎక్స్ షోరూం ధర రూ.49,900 కాగా, ఎల్ఐ ప్లస్ ఎక్స్ షోరూం ధర రూ.59,900గా ఉంది. ఈ రెండు వేరియంట్లు గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందించనున్నాయి. ఎల్ఏ ప్లస్ వేరియంట్లో యాసిడ్ బ్యాటరీని, ఎల్ఐ ప్లస్ వేరియంట్లో లిథియం ఇయాన్ బ్యాటరీని ఇవ్వనున్నారు. సింగిల్ ఛార్జింగ్‌తో రెండు వేరియంట్లు 70 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తాయి.
Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!