Venus Transit  in Capricorn from 2024 December 02:  శని గ్రహం రెండున్నరేళ్లకు ఓ రాశి నుంచి పరివర్తనం చెందుతాడు. ఇక రాహు కేతువులు ఏడాదికోసారి రాశి మారుతాయి. చంద్రుడి సంచారం నక్షత్రాన్ని అనుసరించి ఉంటుంది. ప్రతి రోజూ నక్షత్రమే చంద్రుడి సంచారంగా చెబుతారు. మిగిలిన గ్రహాలైన శుక్రుడు, సూర్యుడు,బుధుడు, బృహస్పతి, కుజుడు తరచూ రాశులు మారుతూ ఉంటాయి. వీటిలో శుక్రుడు, బృహస్పతి గ్రహాల సంచారం అత్యంత ప్రధానంగా చూస్తారు. జాతక చక్రంలోనూ ఈ రెండు గ్రహాలు బలమైన స్థానంలో ఉంటే తిరుగులేదంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇవే గ్రహాలు నీచ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని ఉన్నా ఏదో లోటు కొనసాగుతూనే ఉంటుందని చెబుతారు. అయితే వ్యక్తిగత జీవితం సంగతి పక్కనపెడితే..ఆయా గ్రహాలు రాశులు మారిన ప్రతిసారీ ఆ ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది.. కొందరిపై ప్రతికూల, మరికొందరిపై అనుకూల, ఇంకొందరిపై మిశ్రమ ప్రభావం ఉంటుంది. మరి డిసెంబరు నుంచి డిసెంబరు 29 వరకూ మకరంలో సంచరించే శుక్రుడి వల్ల ఏ రాశులవారికి  కష్టాలు మొదలవుతాయో ఇక్కడ తెలుసుకోండి.. 


మిధున రాశి (Gemini)


మకర రాశిలో శుక్రుడి సంచారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. డిసెంబరు ప్రధమార్థంలో వ్యక్తిగత-ఉద్యోగ జీవితంలో ఇబ్బందులుంటాయి. అనారోగ్య సూచనలు, వాహనప్రమాదాలు ఉన్నాయి..జాగ్రత్త పడండి. ద్వితీయార్థంలో పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారే సూచనలున్నాయి.


కుంభ రాశి ( Aquarius )


మకరంలో శుక్రుడి సంచారం అంటే మీ రాశి నుంచి పదకొండో స్థానంలో అని అర్థం. ఫలితంగా డిసెంబులో మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. కుటుంబంలో వివాదాలు చికాకు తెప్పిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మీ పనికి తగిన ప్రాధాన్యత దక్కదు..అనుకోని బదిలీలు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ అనవసర ఖర్చులు తప్పవు. తొందరగా అలసిపోతారు. మాటలో నియంత్రణ పాటించాలి..అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి


మీన రాశి (Pisces )


ప్రస్తుతానికి మీకు ఏల్నాటి శని నడుస్తోంది. అయినప్పటికీ బృహస్పతి, శుక్రుడి బలం కారణంగా మీపై ఆ ప్రభావం పెద్దగా లేదు. అయితే డిసెంబరులో రాశి మారుతున్న శుక్రుడు..మీనం నుంచి మకరం అంటే దశమ స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా ఈ సమయంలో మీ ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు..ఆదాయం నిలకడగా ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది.  కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం  ఉంటుంది. దూరప్రాంత ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. 


Also Read: భారీగా పెరిగిన అయ్యప్ప ఆదాయం, వసతిపై కొత్త విధానం..శబరిమల భక్తులకు కీలక అప్ డేట్స్!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.