Discount On Tata Altroz Racer: టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ను బడ్జెట్ ఫ్రెండ్లీ, బెటర్ కారు అని పిలుస్తారు. టాటా తొలిసారిగా ఈ కారుపై తగ్గింపు ఆఫర్‌తో ముందుకు వచ్చింది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఈ ఏడాది జూన్ 7వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ చేయబడింది. అప్పటి నుంచి ఐదు నెలల తర్వాత ఈ కారుపై ఆఫర్ వచ్చింది. ఈ కారు మూడు వేరియంట్లలో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.49 లక్షల నుంచి మొదలై రూ. 10.99 లక్షల వరకు ఉంటుంది.
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌పై ధర ఎంత తగ్గుతోంది?
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌పై రూ. 65,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. ఈ కారు ఆర్1, ఆర్2, ఆర్3 అనే మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని టాప్ స్పెక్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు ఈ కారులో 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, పవర్డ్ సన్‌రూఫ్ కూడా అందించారు.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
ఆల్ట్రోజ్ రేసర్ పవర్ ఎంత?
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ వాహనంలోని ఇంజన్ 120 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని స్టాండర్డ్ మోడల్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా పొందుతుంది. టాటా ఈ వాహనంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన డ్యూయల్ క్లచ్ యూనిట్‌ను కూడా తీసుకురావాలని అనుకుంటోంది. రాబోయే కాలంలో టాటా ఈ కారుకు సంబంధించిన ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
టాటా అల్ట్రోజ్ రేసర్ ఫీచర్లు ఇలా...
టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఆరెంజ్, బ్లాక్ థీమ్‌ను కొనసాగిస్తూ స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్‌హోల్స్టరీ లైన్‌లు, స్టిచింగ్‌లపై ఆరెంజ్ హైలైట్స్‌తో కూడిన ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్‌ను అందించారు. సెంటర్ కన్సోల్, ఫుట్‌వెల్ చుట్టూ ఉన్న యాంబియంట్ లైటింగ్ కూడా ఆకర్షణీయమైన ఆరెంజ్ రంగును తలపిస్తుంది. ఆల్ బ్లాక్ సీట్ అప్హోల్స్టరీలో కాంట్రాస్ట్ స్టిచింగ్, స్ట్రిప్స్‌ను కూడా చూడవచ్చు. ఇది రేసర్ ఎంబాసింగ్‌తో హెడ్ రిస్ట్రెయిన్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.
ఆల్ట్రోజ్ రేసర్ కాంపిటీషన్ ఇవే...
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ నేరుగా టాటా ఆల్ట్రోజ్ రేసర్‌తో పోటీపడుతుంది. ఈ హ్యుందాయ్ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చబడింది. ఈ కారులో మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటో గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ మాన్యువల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి మొదలై రూ. 11.42 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.15 లక్షల నుంచి మొదలై రూ. 12.52 లక్షల వరకు ఉంటుంది.
Also Read: సేల్స్‌లో దూసుకుపోతున్న రెనో 7 సీటర్ కారు - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!