Mahindra BE 6e Launched: మహీంద్రా మనదేశంలో బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కూపే కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఈవీ ధర మనదేశంలో రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూం ధర. బీఈ.ఈ6కి కాన్సెప్ట్ మోడలే ఇది. ఇంగ్లో ప్లాట్‌ఫాంపై దీన్ని రూపొందించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు సేల్ మనదేశంలో వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించనున్నారు.


రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో మహీంద్రా బీఈ 6ఈ
ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది. 59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో కేవలం రియర్ వీల్ డ్రైవ్ కాంబినేషన్ మాత్రమే అందుబాటులో ఉంది. వీటిలో 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ 228 హెచ్‌పీ పీక్ పవర్‌ను అందించనుంది. ఇక 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ 281 హెచ్‌పీ పవర్‌ను డెలివర్ చేయనుంది. ఇది గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.7 సెకన్లలోనే అందుకోనుంది.


ఏఆర్ఏఐ ఎస్టిమేట్స్ ప్రకారం 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 682 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇక 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ 535 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తోంది. ఈ రెండు బ్యాటరీలు 170 కేడబ్ల్యూ పీక్ ఛార్జింగ్ స్పీడ్‌ను డెలివర్ చేయనుంది. దీని ద్వారా 20 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లోనే ఎక్కనుంది. ఈ కారును వినియోగదారులు కొనుగోలు చేయాలంటే మాత్రం వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే.



Also Read: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!


ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్‌తో...
మహీంద్రా బీఈ 6ఈ కారు చూడటానికి లోపల, బయట చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. దీని లోపల రెండు 12.3 అంగుళాల స్క్రీన్లను అందించారు. మహీంద్రా ఎంఏఐఏ సాఫ్ట్‌వేర్‌తో ఇవి పని చేస్తాయి. ఈ కారులో కొత్త హెడ్స్ అప్ డిస్‌ప్లే, కొత్త 2 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానికి పార్కింగ్ బ్రేక్, 16 స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టం అందించారు.


దీనికి సంబంధించిన అన్ని వేరియంట్ల ధరలను త్వరలో రివీల్ చేయనున్నారు. ప్రారంభ వేరియంట్ ధర ఛార్జర్‌తో కలిపి కాదు. అంటే ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాలన్న మాట. 11.2 కేడబ్ల్యూహెచ్ లేదా 7.3 కేడబ్ల్యూహెచ్ యూనిట్‌ను అదనంగా కొనాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.


Also Read: రూ.80 వేలలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - హోండా, హీరో, టీవీఎస్, ఎలక్ట్రిక్ కూడా!