Telangana 10th Class results Internal Marks System | హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ మార్కుల విధానంపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల విధానాన్ని కొనసాగించాలిన నిర్ణయం తీసుకుంది. 2025-26 నుంచి తెలంగాణలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేయనున్నట్లు స్పష్టం చేశారు. దాంతో ఈ ఏడాది 80 శాతం మార్కులతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 20 శాతం ఇంటర్నల్ మార్కులను కంటిన్యూ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేడింగ్ విధానంలో మార్కుల ఫలితాలు వెల్లడించనున్నారు. 


టెన్త్ మార్కుల విధానంపై సంస్కరణలు


Telangana SSC Students | తెలంగాణ టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం మరో అప్‌డేట్ ఇచ్చింది. విద్యా వ్యవస్థలో ఎంతో కీలకమైన 10వ తరగతి మార్కుల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం టెన్త్‌లో ఫైనల్ పరీక్షలు 80 మార్కులు కాగా, ఇంటర్నల్ మార్కులు 20 ఉంటాయని తెలిసిందే. అయితే ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల (Internal Marks) విధానాన్ని సర్కారు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయాన్ని ఈ ఏడాదికి వాయిదా వేస్తూ శుక్రవారం మరో నిర్ణయం తీసుకుంది. కేవలం ఫైనల్ పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి అని విద్యార్థులు భావించారు. స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం నాడు దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఎగ్జామ్ ఫీజు వివరాలు అధికారిక వెబ్‌సైట్  https://www.bse.telangana.gov.in/ లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.




ఈ ఏడాదికి వాయిదా పడిన ఇంటర్నల్ రద్దు 


కాగా ఆకస్మిక నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల విధానాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది. ఇంటర్నల్ 20 మార్కుల విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్ మార్కుల్లో తప్పిదాలు, కొందరికి అధిక మార్కులు వస్తున్నాయన్న ఆరోపణలతో తొలుత ఈ విధానానికి ఈ ఏడాది బోర్డ్ ఎగ్జామ్స్ నుంచే స్వస్తి పలకాలని భావించారు. ఈ నిర్ణయంపై పునరాలోచించిన స్కూల్ ఎడ్యూకేషన్ 2025 -26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులకు స్వస్తి పలికి, మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్స్ నిర్వహించన్నట్లు స్పష్టం చేసింది. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.



టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలివే..
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.  రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2వ తేదీ వరకూ ఫీజు చెల్లించుకోవచ్చు.  డిసెంబర్ 12 వరకూ రూ.200 ఆలస్య రుసుముతో, రూ.500 ఆలస్య రుసుము (Exam Fee Late Fine) తో డిసెంబర్ 21వ తేదీ వరకూ ఫీజు చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి మొత్తం రూ.125 ఫీజు చెల్లించాలి. 3 పేపర్ల లోపు బ్యాకలాగ్స్ ఉన్న విద్యార్థులు  రూ.110 చెల్లించాలి. 3 పేపర్ల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు ఐతే అదనంగా 60 రూపాయలు చెల్లించాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.


Also Read: Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే