Top-5 schools for quality education in Telangana: దేశంలో మౌలిక వసతులు, విద్య పరంగా మొదటి 5 స్థానాల్లో నిలిచిన పాఠశాలల వివరాలు 'సీఫోర్ స్కూల్ సర్వే-2024' వెల్లడించింది. అకడమిక్‌తోపాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించి మొత్తం 16 కేటగిరీల్లో అధ్యయనం చేసిన తర్వాత ఉత్తమ పాఠశాలలను ఎంపికచేసింది. అయితే ఈ సర్వే ప్రకారం ఢిల్లీ NCR పరిధిలోని టాప్-5 ఇంటర్నేషనల్ డే స్కూళ్లను ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఈ పాఠశాలలు అకడమిక్ ఎక్సలెన్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఎంగేజ్‌మెంట్ రెండింటిలోనూ స్థిరమైన ప్రమాణాలను కలిగిఉన్నాయి. ఇలాంటి స్కూళ్లను తల్లిదండ్రులు ఎక్కువగా కోరుతున్నారు.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. మొత్తం 7 స్కూల్స్ టాప్-5 స్థానాల్లో నిలవడం విశేషం. ఇందులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ కైవసం చేసుకుంది. ఇక మూడో స్థానంలో విద్యారణ్య హైస్కూల్, ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిలిచాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో గ్లెండేల్ అకాడమీ గీతాంజలి స్కూల్, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిలిచాయి. 

ఈ అంశాలు పరిగణనలోకి..విద్యలో ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత మార్కెట్ పరిశోధనా సంస్థగా Cfore గుర్తింపు పొందింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల యోగ్యత, పెడగోగి & పాఠ్యాంశాల ఔచిత్యం, నాయకత్వం, పాలన, మౌలిక వసతులు, సామాజిక సమ్మిళితత వంటి క్లిష్టమైన అంశాల ఆధారంగా విస్తృతమైన మూల్యాంకనాన్ని సీఫోర్ సంస్థ నిర్వహించింది. ఈ సమగ్ర మూల్యాంకనం పాఠశాలల అకడమిక్ విధానం, చక్కటి విద్యను అందించే వారి సామర్థ్యాలను బహిర్గతపరుస్తోంది.

తెలంగాణలో టాప్-5 ఉత్తమ పాఠశాలలు ఇవే..

పాఠశాల పేరుర్యాంకుస్కోరు
ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ - హైదరాబాద్1307
CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్21246
విద్యారణ్య హైస్కూల్ - హైదరాబాద్21246
ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ - హైదరాబాద్1244
గ్లెండేల్ అకాడమీ - హైదరాబాద్1243
గీతాంజలి స్కూల్ -  హైదరాబాద్ 1243
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్1238

వివిధ విభాగాల్లో ఆయా పాఠశాలలు సాధించిన స్కోరు పరిశీలిస్తే..

హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్,బేగంపేట్‌..

కేటగిరీగరిష్ఠ మార్కులు స్కోరు
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్  150 134
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్150 134
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్  100 89
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్100 86
కో-కరికులర్ యాక్టివిటీస్100 89
స్పోర్ట్స్ 100 94
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్  100 92

CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్..

కేటగిరీగరిష్ఠ మార్కులు స్కోరు
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్  150 133
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్150 134
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్  100 84
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్100 81
కో-కరికులర్ యాక్టివిటీస్100 86
స్పోర్ట్స్ 100 87
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్  100 86

విద్యారణ్య హైస్కూల్ - హైదరాబాద్..

కేటగిరీగరిష్ఠ మార్కులు స్కోరు
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్  150 135
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్150 143
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్  100 82
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్100 94
కో-కరికులర్ యాక్టివిటీస్100 81
స్పోర్ట్స్ 100 77
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్  100 85

ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ - హైదరాబాద్..

కేటగిరీగరిష్ఠ మార్కులు స్కోరు
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్  150 134
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్150 138
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్  100 85
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్100 92
కో-కరికులర్ యాక్టివిటీస్100 80
స్పోర్ట్స్ 100 81
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్  100 84

గ్లెండేల్ అకాడమీ - హైదరాబాద్

కేటగిరీగరిష్ఠ మార్కులు స్కోరు
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్  150 132
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్150 133
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్  100 84
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్100 83
కో-కరికులర్ యాక్టివిటీస్100 83
స్పోర్ట్స్ 100 91
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్  100 91

గీతాంజలి స్కూల్ -  హైదరాబాద్..

కేటగిరీగరిష్ఠ మార్కులు స్కోరు
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్  150 133
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్150 132
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్  100 84
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్100 82
కో-కరికులర్ యాక్టివిటీస్100 84
స్పోర్ట్స్ 100 85
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్  100 81

సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ - హైదరాబాద్..

కేటగిరీగరిష్ఠ మార్కులు స్కోరు
టీచర్ కాంపిటెన్స్ అండ్ రిలేషన్‌షిప్  150 131
పెడగోగి అండ్ రిలవెంట్ కరికులమ్150 135
టీచర్ కేర్ అండ్ గ్రోత్ ఎన్విరాన్‌మెంట్  100 85
పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్100 82
కో-కరికులర్ యాక్టివిటీస్100 81
స్పోర్ట్స్ 100 84
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్  100 80

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...