Horoscope Today November 24, 2024
మేష రాశి
ఈ రోజు ఏ పని ప్రారంభించినా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అప్పులు చేయకపోవడం మంచిది. మీ సహోద్యోగుల తీరుపట్ల మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకోవద్దు.
వృషభ రాశి
ఈ రోజు మీరు ఆర్థిక సంబంధిత విషయాల గురించి ఆందోళన చెందుతారు. తెలియని వ్యక్తులకు అప్పులు ఇవ్వొద్దు. అతి విశ్వాసం వల్ల మీ పని చెడిపోవచ్చు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మిథున రాశి
ఈ రోజు మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పొందుతారు. మీరు ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నట్టైతే మీరు మంచి విజయం సాధిస్తారు. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.
Also Read: దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!
కర్కాటక రాశి
ఈ రోజు ఇంట్లో, కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది. మాటలు అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు మీ వ్యాపార విధానాలలో మార్పులను తీసుకురావడం మంచిది.
సింహ రాశి
క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత అధికారులు మీపై అదనపు బాధ్యత పెంచుతారు. మీరు మీ నైపుణ్యంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. న్యాయపరమైన వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆస్తికి సంబంధించి నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. మీ పరిచయాల సర్కిల్ విస్తరిస్తుంది. ఇంటికి అతిథులు వస్తారు. మీ దినచర్యలో యోగా చేర్చుకోండి.
తులా రాశి
మీరు వ్యాపారానికి సంబంధించి పెద్ద మార్పులు చేర్పులు చేయకుండా ఉండడం మంచిది. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. కీళ్ల నొప్పులకు సంబంధించి కొంత సమస్య ఉంటుంది. అపార్థం వల్ల బంధుత్వాల్లో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. అందరి ముందు ముఖ్యమైన విషయాలు చెప్పకండి.
Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
వృశ్చిక రాశి
ఈ రోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వ్యవహారాలు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ లక్ష్యాల గురించి అవగాహన కలిగి ఉంటారు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. మీరు సాధించిన విజయాలతో మీరు సంతృప్తి చెందలేరు.
ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశి విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. స్నేహితులను కలుస్తారు. చర్చల్లో పాల్గొనేటప్పుడు ఆచితూచి స్పందించండి. కుటుంబ సభ్యుల వివాహానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించండి
మకర రాశి
మీ దినచర్యలో భారీ మార్పులు చేసుకోవాల్సిన సమయం ఇది. వ్యాపారంలో లాభం ఉంటుంది కానీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండవద్దు. అపరిచితులను నమ్మొద్దు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది.
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
కుంభ రాశి
ఈ రోజు మీరు మీ అధికారుల నుంచి మద్దతు పొందుతారు. మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి. ప్రత్యర్థులు బలహీనులవుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు.
మీన రాశి
మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వకంగా ఉండండి. ప్రమాదకర పనులు చేయవద్దు. సామాజిక సేవతో సంబంధం ఉన్న వ్యక్తులు గణనీయమైన ప్రతిఫలాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి సలహా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.