Why Do We Go to Temple and Visit Holy Places: పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగ, ఇంకేదైనా ప్రత్యేకదినం..ఈ సందర్భాల్లో ఆలయాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు భక్తులు.
ఆలయాలకు ఎందుకు వెళ్లాలి?
ఆలయాలకు వెళ్లనివారికి భక్తి లేనట్టా/దేవుడంటే నమ్మకం లేనట్టేనా?
గుడికి వెళ్లాలని చెప్పడం వెనుకున్న పరమార్థం మీకు తెలుసా?
రద్దీగా ఉండే రోడ్లు, రణగొణ ధ్వనులు.. గందరగోళంగా ఉండే ప్రదేశం మధ్యలో కూడా చిన్న చిన్న ఆలయాలుంటాయి. ఆ రద్దీని దాటుకుని గడపదాటి ఆలయంలో అడుగుపెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత. బయట గందరగోళం ఏమీ ప్రభావం చూపించదు. అణువణువు ఆధ్యాత్మికత నిండిపోయి ఉంటుంది. నిజమైన భక్తులకు అయితే ఏదో శక్తి ఆవహించినట్టు అనిపిస్తుంది. ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని అక్కడే కాసేపు కూర్చుని భగవంతుడి నామస్మరణ చేసి ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేస్తారు.
కొందరు భక్తులు తరచూ అలయాలకు వెళుతుంటారు...మరికొందరు ప్రత్యేక రోజుల్లో సందర్శిస్తారు..ఇంకొందరు భగవంతుడు మనసులో ఉన్నాడు చాలు అనుకుని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు.
Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
అయితే రోడ్డుపై నిల్చున్నప్పుడు రాని ప్రశాంతత ఆలయంలో అడుగుపెట్టగానే ఎందుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం అక్కడ అనుసరించే ఆధ్యాత్మిక ప్రక్రియలే అంటారు పండితులు. ఆలయాల్లో నిత్యం జరిగే పూజలు, హోమాలు, అభిషేకాలు ..అన్నిటికీ మించి ఆలయ నిర్మాణం పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇస్తుందని చెబుతున్నారు.
ఆలయం మొత్తం ఒకత్తైతే..గర్భగుడిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. భూమిలో ఎలక్ట్రానిక్ - విద్యుత్ అయస్కాంత తరంగాలు కలిసే ప్రదేశంలో గర్భగుడిని నిర్మిస్తారు. ఆ శక్తులను గ్రహించి మరింత పెంచేందుకే రాగి రేకులను అక్కడ ప్రతిష్టించన తర్వాతే మూలవిరాట్ ను ఉంచుతారు.
దేవాలయంలో ప్రదక్షిణలు చేయమని చెప్పడం వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే. గర్భగుడి కింద ఉంటే శక్తి తరంగాలు దేహానికి చేరి ఓ శక్తిని అందిస్తాయి. శరీరంలో ఉంటే చక్రాలను ప్రభావితం చేస్తాయి
దేవాలయంలో వినిపించే మంత్రాలు, స్తోత్రాలు..లయబద్ధంగా సాగుతుంటాయి. ఆ స్వరాలు శ్రద్ధతో వింటే శరీరంలో ఉండే న్యూరాన్లు ఉత్తేజితమవుతాయి.
మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ..ఆలయాలకు వెళ్లేటప్పుడు పట్టుచీరలు, భారీ ఆభరణాలు ధరిస్తుంటారు. భారీ ఆభరణాలు ఆడంబరం చూపించుకునేందుకు అనుకోవద్దు.. ఆ ప్రాంగణంలో ఉంటే పాజిటివ్ తరంగాలను లోహం త్వరగా గ్రహిస్తుంది. బంగారు ఆభరణాలు అయితే మరింత పవర్ ఫుల్..తద్వారో శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
ఇక అలంకారం సంగతి పక్కనపెడితే.. మడి దుస్తులు, తడి బట్టలతో వెళ్లేవారూ ఉన్నారు. అవెందుకంటే.. తడి వస్త్రాలకు ఆక్సిజన్ పీల్చే శక్తి ఎక్కువగా ఉంటంది. అందుకే తడి వస్త్రాలతో సందర్శించాలని కూడా చెబుతారు...పుణ్యం ఆరోగ్యం రెండూ సిద్ధిస్తాయి
ఇక స్వామివారిని దర్శించుకున్నాక హారతిని కళ్లకు అద్దుకుంటారు. ఎన్నో ఔషధగుణాలున్న హారతిని కళ్లకు అద్దుకునేటప్పుడు ఆ వెచ్చదనం కంటికి మంచి చేస్తుంది.
తీసుకునే తీర్థంలో కలిపే పచ్చకర్పూరం, తులసి, లవంగాలు, పంచామృతాలు...ఇవన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే.
అందుకే ఆలయాలకు వెళ్లడం ఓ పనిగా కాదు..భక్తితోనూ కాదు..ఆరోగ్యం కోసం వెళ్లండని సూచిస్తున్నారు పండితులు.
Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!
ABP దేశంలో మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి