Border Gavaskar Trophy India vs Australia 1st Test: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) ఎలా ప్రారంభం కావాలో అలా ప్రారంభమైంది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజే 72 ఏళ్ల రికార్డు కాల గర్బంలో కలిసిపోయింది. మొదటి రోజే 17 వికెట్లు నేలకూలాయి. పెర్త్ మైదానంలో 72 ఏళ్లలో ఎప్పుడూ తొలి రోజు ఆటలోనే ఇన్ని వికెట్లు నేలకూలలేదు. మొదట కంగారుల బౌలింగ్ చూసి ఇక భారత్(India) కు కష్టమే అనుకున్న వాళ్లంతా.. భారత సీమర్లు నిప్పులు చెరగడం చూసి ఔరా అని అబ్బురపడ్డారు. తొలుత భారత్ 150 పరుగులకే కుప్పకూలినప్పుడు.. ఇక టీమిండియా మారదు అని నొసలు చిట్లించిన వారే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత మంచి స్కోరే చేసిందన్న నిర్ణయానికి వచ్చేశారు. కెప్టెన్ గా బుమ్రా(Bumrah) అద్భుతం చేశాడు. తనను ఎందుకు ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ గా పరిగణిస్తారో.. ఆస్ట్రేలియా(Australia) గడ్డపైనే ఆస్ట్రేలియాకు తెలిసొచ్చేలా చేశాడు. ఇక ఈరోజు తొలి సెషన్ లో కంగారులను చుట్టేస్తే భారత్ కు కీలక ఆధిక్యం దక్కే అవకాశం ఉంది. అదే సాధ్యమైతే కంగారులకు కంగారు తప్పదు.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS: కంగారులకు కంగారు తప్పదా..?.. తొలి సెషనే కీలకం
Jyotsna
Updated at:
23 Nov 2024 08:06 AM (IST)
India vs Australia: పెర్త్ వేదికగా జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ తొలి రోజే అదిరిపోయింది. పెర్త్ మైదానంలో 72 ఏళ్లలో ఎప్పుడూ తొలి రోజు ఆటలోనే 17 వికెట్లు నేలకూలాయి.
బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియన్లు విలవిల
NEXT
PREV
పేకమేడలా...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఒకే రోజు 17 వికెట్లు కూప్పకూలాయి. కంగారుల గడ్డపై 1952 తర్వాత టెస్టుల్లో మొదటి రోజు ఇన్ని వికెట్లు నేలకూలడం ఇదే తొలిసారి. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్ పై అటు కంగారు బౌలర్లు హడలెత్తించగా.. భారత బౌలర్లు వారిది వారికి తిరిగిచ్చేశారు. బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం కంగారుల వల్ల కాలేదు. పేస్, బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్ పై టీమిండియా సారధి చెలరేగిపోయాడు. ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లతో కంగారులను కంగారు పెట్టాడు. మరోవైపు హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ కూడా నిప్పులు చెరగడంతో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగుల వెనకంజలో ఉంది. కంగారులను వీలైనంత తక్కువ పరుగులకు పరిమితం చేస్తే.. భారత్ తొలి టెస్టుపై దాదాపుగా పట్టు బిగించినట్లే. భారత్ కు 50 పరుగులకుపైగా ఆధిక్యం లభిస్తే ఈ పిచ్ పైమంచి ఆథిక్యం సాధించినట్లే. ఇప్పటికే నిప్పులు చెరుగుతున్న భారత సీమర్లను ఎదుర్కోవడం కంగారులకు అంత తేలికేం కాదు.
బుమ్రా దెబ్బకు విలవిల
అమ్మో బుమ్రా... ఈ మ్యాచులో బుమ్రా బౌలింగ్ చూసి ఆస్ట్రేలియన్లు కచ్చితంగా ఇదే అనుకుని ఉంటారు. తొలి టెస్టులో భారత్ పేసర్, కెప్టెన్ జస్పిత్ బుమ్రా విజృంభించాడు. బుమ్రా ధాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజ్ లు నిలబడటానికే భయపడిపోయారు. కీలకమైన 4 వికెట్లు తీసిన బుమ్రా ఆసీస్ నడ్డి విరిచారు. కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా వేసిన పది ఓవర్లలో నాలుగు మెయిడిన్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆసీస్ 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 90 పరుగులు వెనుకబడింది.
ఆస్ట్రేలియా బెండు తీసిన తెలుగోడు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా సరిగ్గా 150 పరుగులు చేయగలిగింది. బోర్డర్- గవాస్కర్ సీజన్ లోని తొలిటెస్టులో టీమిండియాకు చెక్ పెట్టాలని అనుకుంది ఆస్ట్రేలియా. అనుకున్నట్లుగానే భారత బ్యాటర్లకు చుక్కలు చూపించింది. అయితే తెలుగోడు బ్యాటింగ్ కు రావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(Nitish) పోరాటంతో కంగారూ టీమ్ బేజారైంది. అటాకింగ్ బ్యాటింగ్‌తో నితీశ్.. కంగారూల బెండు తీశాడు. 41 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
Published at:
23 Nov 2024 08:06 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -