India vs Australia Highlights, 1st Test Day 1:
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరుగుతోంది. తొలి రోజు మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటంది. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే తరువాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆరంభం నుంచే వరుస షాక్‌లు ఇచ్చారు. వికెట్ల మీద వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి 19 పరుగులతో అలెక్స్ కారీ , 6 పరుగులతో మిచెల్ స్టార్క్ క్రీజులో ఉన్నారు. బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.