Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

 భారత్ 150 కి ఆలౌట్ అయిపోయింది అని బాధపడేలోపు...మన బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను కుప్పకూల్చేశారు. మీరేం బాధపడకండి ఫ్యాన్స్ మేమున్నాం అన్నట్లు కంగారూలను క్రీజులో నిలబడనీయకుండా పెవిలియన్ కు పంపేశారు. ఫలితంగా ఆసీస్ 67పరుగులకే 7వికెట్లు కోల్పోయింది. ప్రధానంగా కెప్టెన్ బుమ్రా అయితే ఫైర్ ఫైర్ ఫైర్ అంతే. తనకున్న ఫామ్ ను ఘనంగా కొనసాగిస్తూ 4వికెట్లు పడగొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరి సిరాజ్ మియా ఏమన్నా తక్కువవాడా లబుషేన్, మిచ్ మార్ష్ లను అవుట్ చేసి మీమర్లకు ఫుల్ స్టఫ్ ఇచ్చాడు. ఈరోజు మన డీఎస్పీ ఇద్దరు దొంగలను పట్టుకున్నారంటూ లబు, మార్ష్ మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. హర్షిత్ రానా కూడా బ్రిలియంట్ బౌలింగ్. హెడ్ మాస్టర్ ను పెద్దలెక్క చేయకుండానే ఫెయిల్ చేసేశాడు. మొత్తంగా కుప్పకూలిపోయింది అనుకున్న భారీ బిల్డింగ్ లాంటి భారత్ ను ఇదిగో ఇలా మన బౌలర్లు చెక్క దుంగల్లా మారి పడిపోకుండా ఆపారంటూ మీమ్స్ తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు ఫ్యాన్స్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola