KL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP Desam

Continues below advertisement

 పెర్త్ లో మ్యాచ్ గెలిచి సిరీస్ ను విజయంతో ఆరభించటం టీమిండియాకు చాలా అవసరం. మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ ఆడాలంటే ఈ సిరీస్ లో కనీసం నాలుగు మ్యాచులు గెలవాలి. కానీ పెర్త్ లో ఊహించని ఇబ్బంది ఎదురైంది టీమిండియాకు. చెలరేగిపోయిన ఆసీస్ బౌలర్ల ముందు భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. 150కే ఆలౌట్ అయ్యారు. తర్వాత మన బౌలర్లు కూడా దుమ్ములేపారు లేండీ అది వేరే సంగతి. కానీ కేఎల్ రాహుల్ ఇవాళ అవుట్ అయిన విధానం వివాదస్పదంగా మారింది. టీమిండియా 47పరుగులకే 3వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్ బాగానే ఆడుతున్నాడు.26 పరుగులు చేశాడు అప్పటికే. మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేసిన 23 వ ఓవర్ లో ఓ బంతి రాహుల్ బ్యాట్ పక్కనుంచి వెళ్లింది. కీపర్ క్యాచ్ పట్టడంతో ఆసీస్ గట్టిగా అప్పీల్ చేసింది. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్ కమిన్స్ డీఆర్ఎస్ కి వెళ్లాడు. డీఆర్ఎస్ లో స్నికోమీటర్ ను చూశారు. అది కూడా లెగ్ సైడ్ నుంచి...అదేంటో మరి మరో కెమెరా యాంగిలే లేనట్లు. డీఆర్ఎస్ లో తేలింది ఏంటంటే బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్తున్నప్పుడే బ్యాట్ రాహుల్ ప్యాడ్ కి తాకింది. స్ట్రైగా చూసినప్పుడు బ్యాట్ పక్క నుంచి వెళ్తున్న బాల్..సైడ్ నుంచి చూసినప్పుడు స్నికోలో స్పైక్ చూపించింది. బట్ ఈజీగా అర్థం అవుతోంది ఏంటంటే బ్యాట్ ప్యాడ్ కి తగిలింది అని. కానీ థర్డ్ అంపైర్ ఎందుకో అవుట్ ఇచ్చేశాడు. అది కూడా మరో కెమెరా యాంగిల్ కూడా చెక్ చేయకుండా. నమ్మశక్యం కానీ రీతిలో రాహుల్ దిగాలుగా క్రీజ్ వదిలాడు. తల అడ్డంగా ఊపుతా. తర్వాత ఫ్యాన్స్ రాహుల్ స్ట్రైట్ కెమెరా విజువల్స్ ను జూమ్ చేసి వీడియోలు, ఫోటోలు పెడుతుంటే క్లియర్ గా తెలుస్తోంది బ్యాట్ పక్కగా బాల్ వెళ్లింది కానీ తగల్లేదని..ప్యాడ్ కి బ్యాట్ తగిలిన స్పైక్ చూసి అవుట్ ఇచ్చేయటం ఏంటో..ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చినా మరో కెమెరా యాంగిల్ చూడకుండా స్నికో లో స్పైక్ ఉందని థర్డ్ అంపైర్ అవుట్ అని ప్రకటించేయటం ఏంటో...పాపం బ్యాడ్ లక్ అంతా రాహుల్ దే. కానీ ఇది వివాదస్పదం అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram