Rishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP Desam

Continues below advertisement

 ఉండే కొద్దీ పంత్ బ్యాటింగ్ కి అంతూ పొంతు లేకుండా పోతోంది. అసలు ఎలా పడి ఎలా కొడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. మళ్లీ కొట్టేదీ ఏమీ ఆషా మాషీ వాళ్లను కాదు. ఇంగ్లండ్ లో లార్డ్స్ లో ఆండర్సన్ ని సిక్స్ కొడతాడు...పెర్త్ కి వచ్చి కమిన్స్ కి ఎర్త్ పెడతాడు. సరే ఎవరైనా సిక్స్ కొడతారు ఇదేంటి అసలు. అతనో లెఫ్టీ..సంప్రదాయంగా లెగ్ సైడ్ ఆడితే హుక్ చేసి ఆడితారు..పుల్ షాట్ ఆడతారు..ఇదేంటో బాడీ మొత్తం ఆఫ్ సైడ్ పడేసి..పడేయటం కాదు పడిపోతాడు పూర్తిగా పడిపోతూ ఓవర్ ఫైన్ లెగ్ లో సిక్స్ కొట్టాడు. అదీ కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ని. సైలెన్సర్ కి సౌండ్ లేకుండా పోయింది. పంత్ ఈ సిక్స్ కొట్టినప్పుడు ఇండియా స్కోరు 6వికెట్ల నష్టానికి 108 పరుగులు. మైండ్ సెట్ అండ్ ఇంటెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. అతనికి బెదురు ఉండదు. ప్రపంచంలో ఆడుతున్నది ఏ స్టేడియంలో అని చూడడు. ర్యాంప్ ఆడేస్తాడు అంతే. ఇవాళ పంత్ కొట్టిన షాట్ ని ఏమని పిలవాలో తెలియక తికమకపడ్డారు కామేంటేటర్లు. అందరూ ఆస్ట్రక్ అంతే. కొలతలు కొలుచుకుంటున్నారు ఇలా. ఎంత యాంగిల్ తో కొట్టాడు..తిరిగాడు..పడ్డాడు అని. మీమర్స్ అయితే పంత్ కి విగ్రహం పెట్టాలంటే కష్టం అంట. ఎందుకంటే ఆ విగ్రహం ఇలా ఉండాలి. ఆర్టిక్టెచ్ర్లీ అది ఇంపాజిబుల్ కాబట్టి. మొత్తం మీద నితీశ్ తోడుగా పంత్ పోరాటంతో టీమిండియా 150 పరుగులన్నా చేయగలిగింది. ఆసీస్ కూడా ఎలాగో కుప్పకూలింది కాబట్టి..సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్పైడీ బాబు ఈ జోరు చూపిస్తే పెర్త్ లో టీమిండియా జెండా పాతొచ్చు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram