Some People criticizing celebrities for publicity :  తెలుగుసినిమా స్టార్ రామ్ చరణ్ కొద్ది రోజుల కిందట కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారు. దేవుళ్లపై అమితమైన  భక్తి ఉన్న రామ్ చరణ్ పెద్ద దర్గాను సందర్శించడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ పలుమార్లు సందర్శించారు. ఈ సారి అయ్యప్ప దీక్షలో ఉన్నారు. తన కొత్త సినిమా గేమ్ ఛేంజర్ విషయంలో మంచి జరగాలనో.. లేకపోతే దర్శించుకోవాలని అనుకున్నారో కానీ వెళ్లారు. అయితే దీనిపై విమర్శలు చేసేదుకు కొంత మంది ఉత్సాహపడుతున్నారు. తామే హిందూ ఉద్దారకులం అన్నట్లుగా మాట్లాడుతూ మీడియా ముందుకు వస్తున్నారు. దీంతో అసలు రామ్ చరణ్ చేసిన తప్పేమిటో అసలైన హిందూత్వ వాదులకు అర్థం కావడం లేదు. 


కడప పెద్ద దర్గాకు కులమతాలకు అతీతంగా భక్తులు


కడప పెద్దదర్గాకు వచ్చే భక్తుల్లో అత్యధిక మంది హిందువులు ఉంటారు. సెలబ్రిటీలు కూడాపెద్ద ఎత్తున తరలి వస్తారు. అభిషేక్ బచ్చన్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకూ చాలా మంది వస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రామ్ చరణ్, పవన్ కల్యాణ్, గోపీచంద్ సహా చాలా మంది వెళ్లారు. అందరూ హిందువులే. ఈ దర్గా ఉరుసు ఉత్సవానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసేవారిలో హిందువులే ఎక్కువగా ఉంటారు. ఈ ఒక్క దర్గానే కాదు ఏపీలో చాలా చోట్ల దర్గాలు ఉంటాయి. ఇవన్నీ హిందువులకు దర్శనీయ క్షేత్రాలే. అవి ముస్లింలకే ప్రత్యేకమైనవవని ఎవరూ చెప్పరు. 


Also Read: టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?


రామ్ చరణ్ నిఖార్సైన దైవభక్తి పరుడు


రామ్ చరణ్ సినీ నటుడు.స్టార్ ఆయన ఏం చేస్తారో తెలుసుకునేందుకు ప్రజలు ఎప్పటికప్పుడు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో ఆయన తరచూ ఏదో ఓ స్వామి మాలలో ఉండటం చూస్తూనే ఉంటారు. ఆంజయనేస్వామి దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష , అయ్యప్ప దీక్ష ఇలా చాలా దీక్షలు చేస్తూంటారు. రామ్ చరణ్ పెరిగిన లైఫ్ స్టైల్‌లో కూడా ఇలాంటి భక్తి ఉండటం చిన్న విషయం కాదు. ఆయన దీక్షల్లో ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోరు. ఆయన ఎప్పుడూ తన భక్తిని.. హిందూత్వాన్ని బహిరంగంగా ప్రదర్శించుకుని ఏదో చేయాలనుకోలేదు కూడా. పబ్లిసిటీ కూడా కోరుకోరు. ఎందుకంటే ఆయనది నిజమైన భక్తి. ఇప్పుడు ఆయన అయ్యప్పస్వామి మాలలో దర్గాకు వెళ్లారని క్షమాపణలు చెప్పాలని కొంత మంది డిమాండ్ చేయడం ప్రారంభించారు. కానీ వారెవరో ఎవరికీ తెలియదు. రామ్ చరణ్ ను విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుదని తెరపైకి వస్తున్నారు. 


Also Read: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు


హిందూత్వం ఎవరి సొత్తూ కాదు.. ఎవర్నీ ద్వేషించదు !


అయ్యప్ప మాలలో ఉన్నంత మాత్రాన దర్గాకు వెళ్లి పూజలు చేయకూడదని ఎక్కడ ఉందన్న ప్రశ్నజంగానే వస్తుంది. రామ్ చరణ్ దర్గాకు వెళ్లింది దేవుడిని దర్శనం చతేసుకోవడానికి పూజలు చేయడానికే. అయితే ఇక్కడ తమకు చాన్స్ దొరికింది కదా అని కొంత మంది హింతూత్వ పోలీసింగ్ చేసేందుకు బయలుదేరి వచ్చేస్తున్నారు. రామ్ చరణ్ తప్పు చేశారంటూ మాట్లాడుతున్నారు. వీరికి సోషల్ మీడియాలో కొంత మంది జత కలిసి వారికి పబ్లిసిటీ తెస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ హిందూత్వం ముందు వారంతా తేలిపోతారు. కానీ ఇలా హిందూత్వానికి తామే ఉద్దారకులమన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి హంగామా చేయడం మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇాలాంటి వారిని ప్రోత్సహించడం సమాజానికి కీడు చేస్తుందని అంటున్నారు.