తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా


తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఉదయం 9.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


త్వరలో ఏపీలో గ్రూప్స్‌ నోటఫికేషన్లు


ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెంగా ఊపారు. కాగా బుధవారం (మే 25) ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కుదట పడిన శ్రీలక్ష్మి ఆరోగ్యం 


కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిలో పురోగతి ఉందని వైద్యులు తెలిపారు.  వాంతులు తగ్గాయని .. ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నామని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఆరు రోజుల నుంచి అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మరో మలుపు


పార్కింగ్ విషయంలో సమస్య వస్తే ఎవరైనా పోలీస్ స్టేషనుకు వెళతారా? ట్రాఫిక్ కోన్స్ తన్నిన దానికి కేసు పెడతారా? నోటీసులు ఇప్పిస్తారా? యువ కథానాయిక డింపుల్ హయతి (Dimple Hayathi) వర్సెస్ ట్రాఫిక్ డీసీపీ, ఐపీఎస్ రాహుల్ హెగ్డే (IPS Rahul Hegde BK) కేసులో సామాన్య ప్రజలు కొందరిలో కలిగిన సందేహాలు ఇవి. ఈ కేసు వెనుక బలమైన కారణం మరొకటి ఏదో ఉండి ఉంటుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. డింపుల్ హయతి న్యాయవాది పాల్ సత్యానందన్ చెప్పిన వివరాల ప్రకారం... రాహుల్ హెగ్డే మూగ జీవాల పట్ల కఠినంగా వ్యవహరించారని, వాటిని హింసకు గురి చేస్తుంటే డింపుల్ హయతి వద్దని వారించారని, అందుకని ఆమెపై తప్పుడు కేసు పెట్టారని న్యాయవాది పాల్ సత్యానందన్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కొత్త పార్లమెంట్ భవనంపై చంద్రబాబు ప్రకటన


కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ ప్రారంభించుకోవడం దేశానికి గర్వకారణం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి  శుభాకాంక్షలు చెబుతూ..  సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ చారిత్రక నిర్మాణంలో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. కొత్త పార్లమెంట్  భవనంలో  దేశానికి మలుపుతిప్పే నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదరికం లేని దేశం నిర్మూలన దిశగా అడుగులు పడతాయని..  దనికులు, పేదలమధ్య అంతరం తగ్గిపోవాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయిన సందర్భంగా 2047 కల్లా దీన్ని సాధించాలన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి