Kasmir G20 Meeting :  కశ్మీర్‌లో  జీ 20  సదస్సుకు సంబంధించి టూరిజం అంశంపై నిర్వహించిన సన్నాహాక సమావేశానికి కశ్మీర్ వేదిక అయింది. కశ్మీర్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అనే ఆలోచన కొత్తదే.  భద్రతాపరమైన సమస్యలే కాదు.. అంతర్జాతీయంగా ఆ ప్రాంతాన్ని వివాదాస్పదంగా చిత్రీకరించడానికి చైనా, పాకిస్తాన్ తో పాటు మరికొన్ని వాటి మిత్రదేశాలు చేసే ప్రయత్నాలుర చేస్తూ ఉంటాయి. అయితే ఆర్టికల్370 రద్దు తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.   చైనా అభ్యంతరం చెప్పినప్పటికీ జీ 20 సన్నాహక సదస్సు కశ్మీర్‌లో జరిగింది. 30 దేశాల నుంచి మంత్రులు, ప్రతినిధులు వచ్చారు. విజయవంతంగా సదస్సు ముగిసింది. ఏ చిన్న సమస్యా రాలేదు. కిషన్ రెడ్డి టూరిజం శాఖమంత్రిగా సదస్సు విజయంలో కీలక పాత్ర పోషించారు. 


ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలకమైన మార్పులు ! 


మూడేళ్ల కిందటి వరకూ కశ్మీర్ అనే మాట టీవీలో, పేపర్లలో వచ్చిందంటే.. ఖచ్చితంగా మొదట వినిపించే  మాట ఉగ్రవాదుల దాడి. తర్వాత రాళ్ల దాడులు. శాంతిభద్రతల సమస్యలు. కశ్మీర్ అంటే కల్లోలతమైన చరిత్ర. కానీ అదే కశ్మీర్‌లో ఇప్పుడు జీ 20 సన్నాహాక సమావేశం జరుగింది.   ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నా ఎక్కడా చిన్న అపశృతి లేకుండా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరంగా అసలు ఎలాంటి సమస్యా లేదు.  జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019లో రద్దు చేశారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. జమ్మూకశ్మీర్‌లో అతివాదంపై పోరాటంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కశ్మీర్‌లో మిలిటెంట్ దాడులు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. మరోవైపు మిలిటెంట్ల సంఖ్య కూడా తగ్గింది.



కశ్మీర్ అంటే అందాల ప్రపంచం 


జమ్ముకశ్మీర్‌..అందాలకు కేరాఫ్ అడ్రస్. మంచు దుప్పటి కప్పుకున్న భూతల స్వర్గం. ఒక్కసారి అక్కడికి వెళితే మరోసారి చూడాలనిపించే అందాల స్వర్గ ధామం.   కానీ టెర్రరిజం పడగ నీడలో కశ్మీర్ ఇమేజ్ మారిపోయింది.  అదో నరకం.. అక్కడికి వెళ్తే తిరిగి రావడం కష్టమనుకునే పరిస్థితి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ఇమేజ్ క్రమంగా మారుతోంది.  ఇటీవలి కాలంలో కశ్మీర్‌లో  పర్యాటకం ఊపందుకుంది.   మునుపెన్నడూ లేని విధంగా..  అత్యధిక మంది టూరిస్టులు జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఏటా కనీసం రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ వెళ్తున్నారు.   అంతర్జాతీయ పర్యాటకుల కోసం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు… పలు ప్రత్యక్ష అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక పర్యాటకుల రద్దీ పెరగడంతో.. స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.


జీ 20 సన్నాహక సదస్సు  విజయవంతంలో కిషన్ రెడ్డి కీలకం 


కేంద్ర పర్యాటక శాఖతో పాటు సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు తేజం గంగాపురం కిషన్ రెడ్డి కశ్మీర్ కు ప్రపంచంలో ప్రత్యేమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు తేవడానికి  శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన కశ్మీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కశ్మీర్ లో టూరిజం రంగంలోనే తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కూడా వచ్చింది. అందుకే ప్రపంచం దృష్టికి కశ్మీర్ అందాల్ని తీసుకెళ్లి టూరిజంను ప్రమోట్ చేయాలంటే..టూరిజంపై జీ 20 సన్నాహాక సమావేశం అక్కడే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.  రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ను ఆహ్వానించి వేడుకలకు మరింత ప్రాచురత్యం తెల్పింది. 
 
జీ 20 పర్యాటక సదస్సు నిర్వహణతో ప్రపంచం దృష్టికి కశ్మీర్ అందాలు ! 


జీ 20 సన్నాహాక సమావేశం కశ్మీర్ లో విజయవంతం కావడంతో ప్రపంచం దృష్టికి కశ్మీర్ అందాలు మరోసారి వెళ్లాయి. అక్కడ ఇప్పుడు ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నాయని ప్రపంచానికి తెలిసి వచ్చింది. దీంతో పర్యాటకులు పెరగనున్నారు. అక్కడికిపెట్టుబడులు కూడా వస్తాయి. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.