భారతీయ మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లుకు గిరాకీ బాగా పెరిగింది. రూ. 10 లక్షల లోపు కార్ల కొనుగోలుకు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సెడాన్‌లతో పాటు కాంపాక్ట్ SUVల విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా,  ఇప్పటికే ఉన్న లైనప్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి విడుదలకానున్న రూ. 10 లక్షల లోపు కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..   


1. న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు డిజైర్


 రూ. 10 లక్షల లోపు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్, డిజైర్ టాప్ లో ఉన్నాయి. ఈ రెండు కార్లకు సంబంధించి న్యూ జెనరేషన్ మోడల్స్ 2024 జూన్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటీరియర్, ఎక్టీరియర్ తో పాటు సరికొత్త ఫీచర్లతో ఈ కార్లు విడుదలకానున్నాయి. డిజైర్, స్విఫ్ట్ కొత్త 1.2 లీటర్ స్ట్రింగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను 35 kmpl కంటే ఎక్కువ క్లెయిమ్ చేసే ఇంధన సామర్థ్యాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత పెట్రోల్,  CNG ఎంపికలు యథాతథంగా ఉంచబడతాయి. ధరల పరంగా, కొత్త మోడళ్ల ధర ఎక్కువగానే ఉండబోతోంది.  


3. న్యూ-జెన్ హోండా అమేజ్


అమేజ్ కారకు సంబంధించి థర్డ్ జెనెరేషన్ 2023 చివరలోగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న PF2 ప్లాట్‌ఫారమ్ ను మరింత అప్ డేట్ చేసే అవకాశం ఉంది. ఇందులో 1.2-లీటర్ i-VTEC ఇంజన్, 90 bhp,  110 Nm గరిష్ట టార్క్‌ ను విడుదల చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించబడే మోడల్ మాదిరిగా కొత్త రూపు సంతరించుకోనుంది. క్యాబిన్ లోపల, లే అవుట్ 2024 ప్రమాణాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లతో రూపొందించనున్నారు.  


 4. హ్యుందాయ్ ఎక్స్‌టర్


హ్యుందాయ్ Exter SUVని భారత మార్కెట్‌లోకి జూలై 2023 లో విడుదల చేసే అవకాశం ఉంది.  మైక్రో SUV బుకింగ్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి.  జూలై ప్రారంభం నుంచి కొత్త కారు ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎక్స్‌టర్  వేరియంట్ లైనప్, పవర్‌ట్రైన్ వివరాలు కూడా విడుదలయ్యాయి. ఇది గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది. హుడ్ కింద, 1.2 లీటర్ కప్పా ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. పెట్రోల్, CNG ఇంధన ఎంపికలను పొందుతుంది. పవర్ అవుట్‌ పుట్, ట్రాన్స్‌ మిషన్ ఎంపికలు గ్రాండ్ ఐ10 నియోస్,  ఆరాలో లభించే వాటిలానే ఉంటాయి. టాటా పంచ్,  సిట్రోయెన్ C3 లకు ప్రత్యక్ష ప్రత్యర్థి ఉండే ఎక్స్‌ టర్ ప్రారంభ ధర దాదాపు రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.


5. మారుతి సుజుకి ఫ్రాంక్స్-ఆధారిత కూపే SUV


మారుతి సుజుకి-టయోటా JV నుంచి వచ్చే మరో ప్రొడక్ట్ Fronx-ఆధారిత కూపే SUV.   టయోటా క్రాస్ ఓవర్ అంతర్జాతీయ-స్పెక్ యారిస్ క్రాస్ తరహాలో స్టైలింగ్ పొందవచ్చు. Fronx ఇప్పటికే ప్రారంభించబడినందున, 2023 ద్వితీయార్ధంలో టయోటా కొత్త ఉత్పత్తిని బయటకు విడుదల చేఏ అవకాశం ఉంది. ఈ కొత్త కారుకు Taisor అని పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది.


Read Also: అదిరిపో ఫీచర్లు, సూపర్ స్టైలిష్ లుక్, టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!