తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఉదయం 9.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అగ్రి & ఫార్మసీ ఇంజినీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
టాప్-10లో ఇద్దరే తెలంగాణ విద్యార్థులు..
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో విశాఖపట్నానికి చెందిన అనిరుధ్ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. మరో ముగ్గురు విద్యార్థులు టాప్-5లో నిలిచారు. మొత్తంగా టాప్-10లో. తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలో ఏడు, ఎనిమిది, పది ర్యాంకుల్లో నిలిచారు. ఇంజినీరింగ్ ఫలితాల్లో సనపాల అనిరుధ్(విశాఖపట్టణం), తొలి ర్యాంకు సాధించగా, మణింధర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వరుణ్(నందిగామ) మూడో ర్యాంకు, అభిణిత్ మజేటి(హైదరాబాద్) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రి) ఐదో ర్యాంకు, మారదన ధీరజ్(విశాఖపట్టణం) ఆరో ర్యాంకు, వడ్డే శాన్విత(నల్లగొండ) ఏడో ర్యాంకు, బోయిన సంజన(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.
ఇంజినీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు..
➥ 1వ ర్యాంకు – సనపల అనిరుధ్ (టెక్కలి)
➥ 2వ ర్యాంకు – మణింధర్ రెడ్డి (గుంటూరు)
➥ 3వ ర్యాంకు – ఉమేశ్ వరుణ్ (నందిగామ)
➥ 4వ ర్యాంకు – అభిణిత్ మజేటి (హైదరాబాద్)
➥ 5వ ర్యాంకు – ప్రమోద్ కుమార్ రెడ్డి (తాడిపత్రి)
➥ 6వ ర్యాంకు – మారదన ధీరజ్ (విశాఖపట్టణం)
➥ 7వ ర్యాంకు – వడ్డే శాన్విత (నల్లగొండ)
➥ 8వ ర్యాంకు – బోయిన సంజన (శ్రీకాకుళం)
➥ 9వ ర్యాంకు – నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి (నంద్యాల)
➥ 10వ ర్యాంకు – మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం)
మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష; మే 12 నుంచి 14 వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 104 కేంద్రాలు, ఏపీలో 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం వివరాలు...
పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు | 1,53,890 |
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు | 51,461 |
పరీక్షకు హాజరైన విద్యార్థులు | 1,95,275 |
ఉత్తీర్ణత సాధించినవారు | 1,57,879 |
ఉత్తీర్ణత శాతం | 80% |
బాలురు ఉత్తీర్ణత శాతం | 79% |
బాలికల ఉత్తీర్ణత శాతం | 82% |
Related Articles:
➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదు!
➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!
➥ తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ టాప్-10 ర్యాంకర్లు వీరే!