సెలవుపై వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు సెలవులపై వెళ్లగా ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి కూడా సెలవుపై వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణం చేయనున్న చంద్రబాబును బుధవారం కలిసిన సీఎస్ జవహార్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా చదవండి
టీడీపీ దాడులతో భయానక వాతావరణం
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే దాడులు చేస్తున్నారని.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇంకా చదవండి
జగన్ కంచుకోట ఎందుకు కూలింది?
2019 ఎన్నికల్లో 151 సీట్లు.. చరిత్రలో మరెవ్వరూ సాధించరేమో అన్నంత రీతిలో విజయాన్ని సాధించిన జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి చరిత్ర సృష్టించారు. చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. 151 సీట్లు అంటే అది ఆయన విజయం మాత్రమే కాదు.. ఆయనపై జనం పెట్టుకున్న నమ్మకం. మరి నమ్మకం ఏమైంది.. విశ్వాసం ఎందుకు పోయింది. జగన్ కూడా అదే ప్రశ్నించారు. నేను చాలా చేశాను కదా.. నన్ను ఎందుకు నమ్మడం లేదు అని కౌంటింగ్ డే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధపడిపోయారు. ఇంకా చదవండి
బీఆర్ఎస్ కోలుకునే అవకాశం లేదా?
గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు 16.68 శాతం ఓట్లు మాత్రమ వచ్చాయి. అంటే ఐదు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు 21 శాతం పక్క పార్టీలకు వెళ్లిపోయాయి. అందులో కొంత కాంగ్రెస్.. అత్యధికంగా బీజేపీ పొందాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ శరవేగంగా కరిగిపోతోంది. ఆ బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్‌కు బలమైన ఓటు బ్యాంక్ లేకపోవమే అనుకోవచ్చు. ఇంకా చదవండి
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని - ప్రజా తీర్పుతో క్లారిటీ !
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ?. గత ఐదేళ్లుగా వెంటాడిన ప్రశ్నకు ఎన్నికలు సమాధానం ఇచ్చాయి. అమరావతే రాజధాని అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీకి విజయం దక్కింది. మూడు రాజధానుల విధానంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ పరాజయం ఎదురైంది. అంటే .. రాష్ట్ర ప్రజలు అమరావతికే ఓటేశారని అనుకోవచ్చు. ఇంకా చదవండి