CM Jagan On TDP :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే దాడులు చేస్తున్నారని..   గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 


ఆంధ్రప్రదేస్ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తల  అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని కోరారు.  టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.  






ఎన్నికల అనంతరం పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.అయితే అవన్నీ పాత కక్షల కారణంగా  జరుగుతున్నాయని.. టీడీపీ అంటోంది. దెందులూరులో ఓ వైసీపీ కార్యకర్త బెట్టింగ్ కాసి ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని..దానికి కారణం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరేనని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అది రాజకీయ దాడులతో ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.       





 


గవర్నర్ ను కలిసేందుకు వైసీపీ నేతలు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. సాయంత్రం వారు గవర్నర్ ను కలిసి దాడులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.                      


 





 


ఎన్నికల ఫలితాల అనంతరం ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున కేంద్ర బలగాల్ని ఇప్పటికే మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ ప్రత్యేక బలగాలు ఉన్నాయి.