Viral Fashion Show: ఫ్యాషన్ షో (Fashion Show) అంటే యువతలో ఉండే క్రేజే వేరు. అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ర్యాంప్‌(Rampwalk)పై నడుస్తూ తాము ధరించిన దుస్తులు, వస్తువులను ప్రమోట్ చేస్తుంటారు. ఫ్యాషన్ డిజైనర్లు తాము డిజైన్ చేసిన రకరకాల దుస్తులు లేదా వస్తువులను ప్రజలకు పరిచయం చేసేందుకు ఫ్యాషన్ షోలు నిర్వహిస్తుంటారు. ప్రాశ్చాత దేశాల్లో ప్రతి సీజన్‌లో, ముఖ్యంగా వేస, శీతాకాలంలో ఈ ఫ్యాసన్ షోలు జరుగుతుంటాయి. డిజైనర్లు తమ కొత్త ఫ్యాషన్‌ డిజైన్లను మోడల్స్ ద్వారా ప్రదర్శిస్తుంటారు. వింత వింత డ్రస్‌లు వేసుకుని మోడల్స్ నడిచి వస్తుంటే యువత అలా చూస్తూ ఉండిపోతారు. వాటిలో కొన్ని వైరల్ కూడా అవుతుంటాయి. 


తాజాగా ఓ ఫ్యాషన్ షోకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. భారీ రంగు రంగుల బెలూన్లను ధరించిన మోడల్స్ ర్యాంప్‌పై నడుస్తూ సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫ్యాషన్ షో ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలియడం లేదు. ఆ వీడియో మోడల్స్ భారీ రంగురంగుల బెలూన్‌లను ధరించారు. అది వారి శరీరాలను పూర్తిగా చుట్టేసింది. బెలూన్ డ్రస్సులతో ర్యాంప్‌పై మోడల్స్ నడిచి వెళ్తున్నప్పుడు ఫ్యాషన్ షోకు వచ్చిన వారు చప్పట్లు కొట్టారు. 






ఇలాంటి దుస్తులు తయారు చేయడం అంత సులువు కాదని ఓ డిజైనర్ చెప్పుకొచ్చారు.  శ్రీలంకలో తయారయ్యే రబ్బర్‌ను ఉపయోగించి వాటిని తయారు చేస్తారట. ఇందు కోసం అక్కడ రబ్బరు సాగు చేసే రైతుల నుంచి రబ్బరు సేకరిస్తారట. అంతేకాదు ఎయిర్ ప్రెజర్ సిస్టమ్‌తో ఆయా డ్రస్సులను తయారు చేస్తారట. ఇలాంటి డ్రస్సుల తయారీకి చాలా సమయం పడుతుందని, ఓపిక, నైపుణ్యం అవసరం అని చెబుతున్నారు సదరు డిజైనర్.  


ఆ వీడియోపైలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిని పిచ్చి ఫ్యాషన్‌ విమర్శిస్తుండగా మరి కొందరు తమ మద్దతు తెలుపుతున్నారు. ఫ్యాషన్‌‌లో సృజనాత్మకతకు అడ్డు లేదని, ప్రజలను మెప్పించేలా దుస్తులు తయారు చేయడం ఒక గొప్ప విషయమని కౌంటర్ ఇస్తున్నారు. ఇంకొకరు స్పందిస్తూ.. ఇది శతాబ్ధపు ఆవిష్కరణ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది చాలా పాత వీడియో అని 2019లోనే ఇలాంటి ఫ్యాషన్ షోలు జరిగాయని, 2024 కొత్తగా జరిగిందని కాదని కామెంట్ చేస్తున్నారు.