Fact Check: ఇండీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని డీకే శివకుమార్ అన్నారా - ఫ్యాక్ట్‌చెక్

Fact Check: ఇండీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని డీకే శివకుమార్ చెప్పినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

క్లెయిమ్: ఏడు సెకన్ల వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇందులో కర్ణాటక డిప్యూటీ ముఖ్య మంత్రి, డీకే శివ కుమార్ ఇండియా బ్లాక్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరరచలేదు అని అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. X లో Mr. Sinha అకౌంట్‌లో ఇలాంటి తప్పుడు సమాచారం షేర్ అవుతోందని తేలింది. ఈ వీడియో పోస్ట్ చేసి, డి కె శివకుమార్ ఇండియా బ్లాక్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచలేదు అని అన్నారని  రాసుకొచ్చారు. ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 544,000 వ్యూస్ ఉన్నాయి.  అలాంటి పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ, చూడచ్చు.

Continues below advertisement

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (Source : X/Facebook/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కానీ మా రీసెర్చ్‌లో తేలిందేంటంటే ఇది ఎడిట్ చేసిన వీడియో.  ఒరిజినల్ వీడియోలో శివకుమార్ ఎగ్జిట్ పోల్స్ ని నమ్మను అని చెప్తూ, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది అని తెలిపారు. అనేక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి ఓటమికి గురి కాబోతుంది అని, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని తెలిపాయి.

నిజమేంటి..? 

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, జూన్ 3, 2024 నాడు ANI  (ఆర్కైవ్ ఇక్కడ) షేర్ చేసిన ఒక వీడియో లభించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఇక్కడ ఉంది. ఇందులో శివకుమార్ ఓ జర్నలిస్ట్ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలలో గెలుస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అన్ని సీట్లు మేము గెలుస్తాము,” అని తెలిపారు, కానీ ఇక్కడ ఏ రాష్ట్రం గురించి అడిగారు అనేది స్పష్టంగా లేదు.

దాని తరువాత ఎగ్జిట్ పోల్స్ అంచనా గురించి పాత్రికేయులు అడిగిన మరో ప్రశ్నకు, ఇంగ్లీష్ లో శివకుమార్ బదులు ఇస్తూ, “నేను నమ్మను .  ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది” అని తెలిపారు.

దీని ద్వారా వైరల్ వీడియోలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నని తీసేసి, శివకుమార్ సమాధానాన్ని ఎడిట్ చేసి, ‘ఇండియా కూటమి గెలుస్తుందని నేను నమ్మట్లేదు’ ఆని తను అంటున్నట్టుగా షేర్ చేసారు.

ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కుడా తమ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని షేర్ చేసింది. (ఆర్కైవ్ ఇక్కడ), ఇక్కడ ప్రశ్న, సమాధానం చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. ఈ వీడియోకి శీర్షికగా, కర్ణాటక డిప్యూటీ ముఖ్య మంత్రి డీకే శివకుమార్ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది అని అన్నారు అని ఉంది.

పైగా, కూటమి లో భాగమైన శివకుమార్, ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఏర్పరచదు అని అనటం జరిగే పని కాదు. ఆయన కేవలం ఎగ్జిట్ పోల్స్ పైన నమ్మకం లేదు అని అన్నారు. జూన్ 2 నాడు పబ్లిష్ అయినా ఎన్డీటీవీ కథనం కుడా శివకుమార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని లెక్కచేయట్లేదని, పైగా గతం లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఊహిచటంలో ఎలా విఫలమయ్యాయో, అదే విధంగా జరుగుతుంది అని అన్నారని కథనం పేర్కొంది.

తేలిందేంటంటే..

కర్ణాటక డిప్యూటీ ముఖ్య మంత్రి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తను ఎగ్జిట్ పోల్స్ ని నమ్మను అని, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది అని తెలిపారు. కానీ రిపోర్టర్ ప్రశ్నను తీసేసి, శివకుమార్ సమాధానాన్ని ఎడిట్ చేసి వేరే అర్ధం వచ్చేటట్టు ఎడిట్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేం నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరసా)

This story was originally published by Logicallyfacts, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

Continues below advertisement