Soya Tikka Masala Recipe : మిల్​మేకర్ టిక్కా మసాలా.. రోటీల్లోనే కాదు, రైస్​కి కూడా మంచి టేస్టీ కాంబినేషన్ ఇది

Lunch Recipes : వెజిటేరియన్స్​కి ఫుడ్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ చేసుకునే విధానంలో చేస్తే.. నాన్​వెజ్​ వాళ్లు కూడా వెజ్​లోకి మారిపోతారు. అలాంటి టేస్టీ రెసిపీల్లో సోయా టిక్కా మసాలా ఒకటి. 

Continues below advertisement

South Indian Gravy Curry Recipe : మిల్​మేకర్(Soya Chunks)​ని కొందరు తినడానికి ఇష్టపడరు. కానీ దానిని చేసే విధానంలో మార్పు చేస్తే.. రుచి మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సాధారణంగా మిల్​మేకర్​కి ఎలాంటి టేస్ట్ ఉండదు. కాబట్టి మీరు వేసే పదార్థాలతోనే దానికి మంచి రుచి వస్తుంది. ఈ సోయాలతో అందరూ కచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్ ఒకటి ఉంది. అదే మిల్​మేకర్ టిక్కా మసాలా. దీనినే సోయా టిక్కా మసాలా అని కూడా అంటారు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు 

సోయా(మిల్ మేకర్) - 1 కప్పు

క్యాప్సికమ్స్ - 1

ఉల్లిపాయలు - 1 పెద్దది

పసుపు - చిటికెడు

కారం - 1 స్పూన్

ధనియాల పొడి - 1 స్పూన్ 

గరం మసాలా - 1 స్పూన్ 

శనగపిండి  - 2 టేబుల్ స్పూన్స్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

ఉప్పు - రుచికి తగినంత 

పెరుగు - అరకప్పు

నూనె - వంటకు సరిపడా

జీలకర్ర - 1 స్పూన్

బిర్యానీ ఆకు  - 1

ఉల్లిపాయ - 1 

పసుపు - చిటికెడు

కారం - రుచికి తగినంత

టమోటా - 1 

గరం మసాలా - 1 స్పూన్ 

కెచప్ - 1 టేబుల్ స్పూన్ 

కసూరీ మేతి - చిటికెడు

పచ్చిమిర్చి - 3 

కొత్తిమీర - చిన్న కట్ట

తయారీ విధానం.. 

ముందుగా మిల్​మేకర్​ను వేడినీటిలో బాయిల్ చేయాలి. అనంతరం వాటి నుంచి నీటిని పిండేసి.. మ్యారినేటి చేసి పెట్టుకోవాలి. దానికోసం క్యాప్సికమ్, ఉల్లిపాయలను పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఉడికించిన మిల్​మేకర్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. పసుపు, కారం, ధనియాలపొడి, గరంమసాలా, డ్రై రోస్ట్ చేసిన శనగపిండిని కూడా దీనిలో వేయాలి. రుచికి తగినంత ఉప్పు, అరకప్పు పెరుగు వేసి.. అన్ని మిక్స్​ అయ్యేలా బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. మిల్​మేకర్​ పట్టేలా కలపాలి. 

అరగంట తర్వాత స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టాలి. దానిలో కాస్త నూనె వేసి.. ముందుగా మేరినేట్ చేసి పెట్టుకున్న మిల్​మేకర్ దానిలో వేసి రోస్ట్ చేయాలి. ఓ పది నిమిషాలు వేయించుకున్న తర్వాత.. వాటిని వేరే బౌల్​లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి వేడిచేయాలి. దానిలో జీలకర్ర వేయండి. అనంతరం దానిలో బిర్యానీ ఆకువేయాలి. అనంతరం దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. వేయించుకోవాలి. 

ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో పసుపు, కారం వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో సన్నగా, చిన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత దగ్గరవుతుంది. ఆ సమయంలో వేయించుకున్న మిల్​మేకర్ వేయాలి. గ్రేవీలో ఇవి బాగా మిక్స్​ అయ్యేలా కలపాలి. ఇప్పుడు పక్కన స్టౌవ్ మీద కప్పున్నర వేడి నీళ్లు సిద్ధం చేసుకోవాలి. వేడి నీళ్లను తయారు చేసుకుంటున్న పాన్​లో వేయాలి. దీనివల్ల కర్రీ త్వరగా కుక్ అవుతుంది. 

మూడు నిమిషాలు దానిపై మూత పెట్టి కుక్ చేస్తే.. మంచి గ్రేవీ సిద్ధమవుతుంది. దానిలో ధనియాల పొడి, టొమాటో కెచప్, కసూరి మేతి వేసి బాగా కలపాలి. ఇది గ్రేవీని, రుచిని పెంచుతుంది. చివర్లో పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తురిమి కొత్తిమీర వేసి స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ సోయా టిక్కా మసాలా రెడీ. దీనిని మీరు రోటీలలో, రైస్​లలో తీసుకోవచ్చు. ఇది మీకు మంచి రుచిని అందిస్తుంది.  

Also Read : ఈజీగా చేయగలిగే టేస్టీ బర్ఫీ.. ఈ స్వీట్ రెసిపీ చాలా సింపుల్ గురూ

Continues below advertisement