Look Younger Secrets : లైఫ్స్టైల్లో మార్పుల వల్ల.. లేదంటే ఇతర మేకప్, హెయిర్ స్టైల్వల్ల కొందరు తమ వయసుకంటే పెద్దగా కనిపిస్తారు. కొందరు మొహమాటం లేకుండా కూడా దానిని మొహంపై చెప్పేస్తారు. కొన్నిసార్లు మీరు వేసుకునే డ్రెస్‌లు కూడా మిమ్మల్ని వయసుకంటే పెద్దగా కనిపించేలా చేస్తాయి. అందుకే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఇవి మిమ్మల్ని యంగ్‌గా కనిపించడంలో సహాయం చేస్తాయి. పైగా ఇవి మీ వయసుకున్నా మీరు చిన్న వయసులా కనిపించేలా చేస్తాయి. ఎలా అంటే..
లైఫ్‌స్టైల్..
కొందరు ఏది పడితే అది తింటూ.. శరీరంపై కొంచెం కూడా శ్రద్ధ వహించరు. అలాంటివారు తినే విషయంలో బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నారనిపిస్తే దానిని తగ్గించుకునేందుకు ట్రై చేయండి. ఎందుకంటే అధిక బరువు మిమ్మల్ని మీ వయసుకంటే మీరు పెద్దవారిలా కనిపించేలా చేస్తుంది. రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తే.. బరువు తగ్గడంతో పాటు.. మొహంలో సహజమైన గ్లో వస్తుంది. ఇది యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
హెయిర్ స్టైల్..
మీ లుక్స్‌ని హెయిర్ స్టైల్స్ బాగా డామినేట్ చేస్తాయి. ఎందుకంటే.. మీరు అందంగా కనిపించాలన్నా.. వికృతంగా కనిపించాలన్నా వీటితోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన స్టైల్స్‌లో హెయిర్‌పై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ ముఖానికి ఏ హెయిర్ స్టైల్ బాగా నప్పుతుందో గుర్తించి.. వాటిని ట్రై చేయండి. జుట్టును స్టైల్ చేయడం, కర్ల్స్ చేయడం వంటివి చేస్తూ ఉంటే.. ఇవి మీరు యంగ్‌గా కనిపించేలా చేస్తాయి. మధ్యపాపిడి తీస్తే.. మీరు వయసుకన్నా పెద్దవారిగా కనిపిస్తారని గుర్తించుకోండి. సైడ్ పార్టీషన్స్ కాస్త యంగ్‌లుక్ ఇస్తాయి.
మేకప్..
ట్రెండీగా ముస్తాబయ్యేవారు కచ్చితంగా మేకప్‌పై దృష్టి పెట్టాలి. అలాగే ట్రెడీషనల్గా ఉండేవారు కూడా కొన్ని రెగ్యూలర్‌గా ఫాలో అవ్వాలి. ఇండియన్ వేర్ వేసుకున్నప్పుడు ముఖానికి కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. ఇది మీ లుక్‌ని బెటర్ చేస్తుంది. మీ ముఖానికి తగ్గట్లు బొట్టు సైజ్ ఉండేలా చూసుకోండి. పెద్ద బొట్టు పెట్టుకుంటే అది హుందాగా ఉండొచ్చు కానీ.. మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చిన్న బొట్టుకు ప్రాధాన్యత ఇస్తే మంచిది.
స్కిన్ కేర్ రోటీన్
ఉదయం, సాయంత్రం కచ్చితంగా స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి. ఇవి ముఖంపై మురికిని, పింపుల్స్‌ని దూరం చేసి.. మెరిసే, అందమైన లుక్‌ని ఇస్తాయి. స్కిన్‌కేర్ ఫాలో అవ్వడం వల్ల ముడతలు కూడా దరి చేరవు. కచ్చితంగా పడుకునే ముందు మీ మొహంపై మేకప్ లేకుండా చూసుకోండి. ఇది వృద్ధాప్యఛాయలను త్వరగా ప్రేరేపిస్తుంది. వారానికి రెండుసార్లైనా ఎక్స్‌ఫోలియేటింగ్ చేయడం వల్ల ముఖంలో మంచి గ్లో వస్తుంది.
దుస్తుల ఎంపికలో..
కొన్ని దుస్తులు మీకు కంఫర్ట్‌గా ఉండొచ్చు కానీ.. చూసేందుకు మీరు పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. రౌండ్ నెక్స్ మిమ్మల్ని పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి క్లోజ్డ్ నెక్ డ్రెస్‌లు లేదా షర్ట్లు ట్రై చేయండి. బాగా వదులుగా ఉండే దుస్తులు కూడా మిమ్మల్ని పెద్దవారిగా చేస్తాయి. అంతేకాకుండా మీ స్కిన్ టోన్‌కి సెట్ అయ్యే రంగుల దుస్తులు ఎంచుకోవాలి. ఇవి కూడా మీరు అందంగా కనిపించండంలో మేజర్ పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే కొన్ని కలర్స్ మిమ్మల్ని డామినేట్ చేసి మీ లుక్‌ని డల్ చేస్తాయి.
ఈ టిప్స్‌ని మీరు ఫాలో అయితే సహజంగా అందంగా కనిపించడం స్టార్ట్ చేస్తారు. ఈ సింపుల్ టిప్స్ కచ్చితంగా మీ లైఫ్‌స్టైల్ పెద్ద మార్పులే తీసుకువస్తాయి.
Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?