Skin Care with Water Melon : పుచ్చకాయను వేసవిలో చాలా ఎక్కువగా తింటూ ఉంటాము. సీజనల్ ఫ్రూట్స్​లలో ఇది కూడా ఒకటి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే దీనిని కేవలం ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసం కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుచ్చకాయలో చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రకాశవంతమైన, మెరిసే ఛాయను అందిస్తాయి. మరి ఈ హైడ్రేటింగ్ ఫ్రూట్​ని స్కిన్​కోసం ఏ విధంగా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


స్కిన్ స్క్రబ్​ కోసం.. 


స్కిన్ హెల్త్​లో ఎక్స్​ఫోలియేటింగ్​ అనేది ప్రభావవంతమైన చర్య. స్క్రబ్(Water Melon Scrub)​గా పుచ్చకాయను తీసుకోవాలనుకుంటే.. దానిలో కాస్త చక్కెర వేసి.. ముఖంపై మసాజ్ చేయాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. దీనిలో సహజమైన ఆమ్లాలు కణాల పునరుద్ధరణను ప్రోత్సాహిస్తాయి. ఇది మెరిసే, కాంతివంతమైన ఛాయను అందిస్తుంది. టోన్​ను మెరుగుపరుస్తుంది. 


చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు..


పుచ్చకాయను వివిధ సలాడ్స్​(Salads)లో కలిపి తీసుకోవచ్చు. పుచ్చకాయ, బ్లూబెర్రీ, కీరదోసను కలిపి మంచి సలాడ్ తయారు చేసుకోవచ్చు. ఇది మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. దీనివల్ల పింపుల్స్ సమస్య తగ్గుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. మంచి పోషకాలతో కడుపు నిండుగా చేస్తుంది. బ్లూబెర్రీలు, పుచ్చకాయలోని లైకోపిన్ ఫ్రీ రాడికల్స్ వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.


ఫేస్ మాస్క్​గా..


తాజా పుచ్చకాయను పేస్ట్​లా చేసి.. పది నిమిషాలు ఫేస్ మాస్క్​(Water Melon Face Mask)లా అప్లై చేయవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలోని విటమిన్ ఏ, బి6, సి స్కిన్ ఇరిటేషన్ తగ్గించి.. హెల్తీ స్కిన్​ను ప్రమోట్ చేస్తుంది. వేడివల్ల కలిగే మంటను తగ్గించి.. రిఫ్రెష్​నెస్ ఇస్తుంది. ఈ ప్యాక్​ను ఉదయం, సాయంత్రం రెగ్యూలర్​గా వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 


స్కిన్ హెల్త్, గ్లో కోసం..


పుచ్చకాయను హైడ్రేటింగ్ స్మూతీ(Water Melon Hydrating Smoothie)లా తయారు చేసుకోవచ్చు. ఇది శరీరానికి హైడ్రేషన్​ అందిస్తుంది. దీనివల్ల చర్మం గ్లో వస్తుంది. అంతేకాకుండా పొడిబారకుండా నిగనిగలాడుతుంది. అయితే ఈ స్మూతీ కోసం.. పుచ్చకాయ జ్యూస్​లో పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి కలిపి తీసుకోవచ్చు. ఇది చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా చల్లని అనుభూతిని ఇస్తుంది. నిమ్మలోని విటమిన్ సి మెరిసే చర్మాన్ని ప్రమోట్ చేస్తుంది. వేసవిలో ఇది మీకు రిఫ్రెష్​నివ్వడమే కాకుండా.. వేడివల్ల కలిగే చర్మ సమస్యలు దూరం చేస్తుంది. 


స్కిన్ ఇరిటేషన్​ను తగ్గించేందుకు..


పుచ్చకాయ జ్యూస్​ను గుజ్జులేకుండా నీటిని వేరు చేయాలి. దీనిని స్పూన్ తీసుకుంటే.. అంతే మొత్తంలో రోజ్ వాటర్​ కలిపాలి. దీనిని స్ప్రే బాటిల్​లో తీసుకుని.. టోనర్​(Body Toner)గా ఉపయోగించవచ్చు. ఇది స్కిన్ ఇరిటేషన్​ను తగ్గిస్తుంది. చికాకును దూరం చేసి.. స్కిన్​ని శాంతపరుస్తుంది. పోర్స్​ని కూడా తగ్గిస్తుంది. దీనిలోని అమైనో ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయి. 


Also Read : అమ్మాయిలకు ఈ లడ్డూలు పెడితే చాలా మంచిది.. పీరియడ్స్ సమయంలో ఆ ఇబ్బందులు తగ్గుతాయి