NBK109 Video Glimpse: గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఓ సినిమా నిర్మిస్తోంది. హీరోగా బాలయ్య 109వ సినిమా అది. అందుకని, NBK109 Movieగా వ్యవహరిస్తున్నారు. ఆ సినిమాకు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పుడు బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday)కి మరో గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు.


పూనకాలు వచ్చేస్తాయి - నాగవంశీ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ శుక్రవారం (మే 31న) థియేటర్లలోకి వస్తోంది. నిన్న రాత్రి (మంగళవారం) హైదరాబాద్ సిటీలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు. అప్పుడు ఎన్.బి.కె 109 గ్లింప్స్ ప్లే చేశారు. ఆ తర్వాత ''గ్లింప్స్  చూశారు కదా! ఎలా ఉంది? జూన్ 10వ తారీఖున ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాం. పూనకాలు వచ్చేస్తాయి'' అని సూర్యదేవర నాగవంశీ తెలిపారు.


ఎన్టీఆర్ అంటే అంత అభిమానం!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా ఎన్టీ రామారావు మీద తనకు ఉన్న అభిమానాన్ని సూర్యదేవర నాగవంశీ చాటుకున్నారు. ''సార్ (బాలకృష్ణ), నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయ్యింది. నా జీవితంలో రామారావు గారు ఎంత ఇంపార్టెంట్ అంటే... సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లోగో పాడినప్పుడు రామారావు గారు శంఖం వూదితే పడుతుంది సార్. కానీ, నేను ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లలో రామారావు గారి పుట్టినరోజు నాడు ఫంక్షన్ చేసే అవకాశం, దానికి మిమ్మల్ని అతిథిగా పిలిచే అవకాశం రాలేదు. విశ్వక్ సేన్ దయ వల్ల ఇవాళ అది కుదిరింది'' అని నాగవంశీ చెప్పారు.


Also Read: ఎలాన్ మస్క్ గారూ... బుజ్జి కోసం 'ఎస్' బాస్‌ కు 'కల్కి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పెషల్ రిక్వెస్ట్


NBK109 నుంచి ఆల్రెడీ ఓ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో బాలకృష్ణ ఓ టూల్ బాక్స్‌ ఓపెన్ చేస్తారు. అందులో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ బాటిల్‌ కూడా ఉంటుంది. దాన్ని కాస్త డ్రింక్ చేశాక... గూండాల్లో ఒకడు 'ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?' అని అంటాడు. 'సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్... ఇట్స్ కాల్డ్ హంటింగ్' అని పవర్ ఫుల్‌గా బాలకృష్ణ చెప్పే డైలాగ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈసారి వేట పూనకాలు తెప్పిస్తుందని నాగవంశీ అంచనాలు మరింత పెంచారు.


Also Readవచ్చే వారం నుంచి గురు, శుక్ర కాదు... 'జబర్దస్త్' టెలికాస్ట్ షెడ్యూల్ మారింది బాసూ!


NBK109 Movie Cast And Crew: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హిందీ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా... 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ, నిరంజన్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.