Nag Ashwin tweet to Elon Musk: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ & టైమ్ ట్రావెల్ సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఆరడుగుల బాహుబలితో పాటు ఈ సినిమాలో మరో స్పెషల్ స్టార్ 'బుజ్జి'. 'కల్కి' కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెహికల్. ఇటీవల గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి బుజ్జిని పరిచయం చేశారు. ఇప్పుడు ఆ బుజ్జి ఎక్కడ ఉందో తెలుసా? చెన్నైలో! ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ 'ఎక్స్' బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.
ఎలాన్ మస్క్ గారూ... మా 'బుజ్జి'ని డ్రైవ్ చేయరూ!
''డియర్ ఎలాన్ మస్క్ గారూ... మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మేం మిమ్మల్ని ఆహ్వానించాలని అనుకుంటున్నాం. ఇది ఆరు టన్నుల బీస్ట్. పూర్తిగా ఇండియాలో తయారు చేయబడినది. మేడిన్ ఇండియా! ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్. మీ సైబర్ ట్రక్ తో ఫోటో దిగడానికి భలే ఉంటుంది'' అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. ఆయన ఒక్కరే కాదు... సోషల్ మీడియాలో పలువురు ఈ విధంగా ట్వీట్లు చేస్తున్నారు.
Also Read: వచ్చే వారం నుంచి గురు, శుక్ర కాదు... 'జబర్దస్త్' టెలికాస్ట్ షెడ్యూల్ మారింది బాసూ!
దేశంలో రోడ్స్ మీద సందడి చేయనున్న బుజ్జి!
హైటెక్ టెక్నాలజీతో మహేంద్ర సంస్థతో పాటు తమిళనాడులో మరొక సంస్థతో కలిసి 'కల్కి' టీమ్ ఈ బుజ్జిని డిజైన్ చేసింది. ఇదొక హైటెక్ రోబో కార్. పూర్తిగా దేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. 'కల్కి'లో బుజ్జి క్యారెక్టర్ కీలకం కానుంది. యాక్షన్ సీక్వెన్సుల్లో హీరోకి సాయం చేసే పాత్ర బుజ్జిది. దీనికి 'మహానటి' కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ అందించారు. జూన్ 27న 'కల్కి' థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అప్పటి వరకు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బుజ్జి సందడి చేయనుంది. ఇదొక విధమైన ప్రచారం అన్నమాట.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
'కల్కి' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాణ సి. అశ్వినీదత్ భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకోన్ కథానాయికగా నటించారు. మరొక నాయికగా 'లోఫర్' ఫేమ్ దిశా పటనీ చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సహా పలువురు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.