ETV Jabardasth Latest Show Update: 'జబర్దస్త్'కు తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ వున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు కదలని ఎంతో మందికి ఆ షో వినోదం పంచుతోంది. ప్రతి వారం కొత్త స్కిట్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఆ షో టెలికాస్ట్ ఎప్పుడు? ఏయే రోజుల్లో వస్తుంది? అని అడిగితే తెలుగు లోగిళ్లలో చిన్న పిల్లలు సైతం సమాధానం చెబుతారు. గురువారం రాత్రి 'జబర్దస్త్', శుక్రవారం రాత్రి 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రసారం అవుతాయి. నెక్స్ట్ వీక్ నుంచి గురు, శుక్ర వారాల్లో ఈ షో రాదు. షెడ్యూల్ మారింది. మరి, షో ఎప్పుడు వస్తుందో తెలుసా?


గురు, శుక్ర కాదు... శుక్ర, శని వారాల్లో!
'జబర్దస్త్' షో ఈ వారం రెగ్యులర్ టైమింగ్స్‌లోనే టెలికాస్ట్ అవుతుంది. అంటే... ఈ గురువారం (మే 30న) టీవీలో ప్రసారం అవుతుంది. అయితే... నెక్స్ట్ వీక్ మాత్రం గురువారం రాదు. జూన్ నెల నుంచి 'జబర్దస్త్' టెలికాస్ట్ షెడ్యూల్ మారుతుంది. ప్రతి శుక్రవారం 'జబర్దస్త్' షో ప్రసారం కానుంది. అంటే... జూన్ 7న టీవీల్లో జనాలు చూడొచ్చు అన్నమాట.


'ఎక్స్ట్రా జబర్దస్త్' షో టెలికాస్ట్ షెడ్యూల్ మాత్రమే కాదు... పేరు కూడా మారింది. ఇక నుంచి 'ఎక్స్ట్రా' అనే పదాన్ని వాడటం లేదు. 'జబర్దస్త్' ముందు నుంచి ఆ పేరును తొలగించారు. అయితే... షో మాత్రం ఆపలేదు. శుక్రవారం టెలికాస్ట్ అయ్యే 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఇక నుంచి 'జబర్దస్త్' పేరుతో శనివారం రాత్రి ప్రసారం అవుతుంది. పేరు మాత్రమే మారిందని, కామెడీకి ఎలాంటి లోటు ఉండదని షో నిర్వాహకుల నుంచి సమాచారం అందుతోంది. 'ఎక్స్ట్రా జోష్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో వస్తాం'' అని లేటెస్ట్ 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమోలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా చెప్పింది.


ఇంద్రజ అవుట్... రెండు రోజులూ ఖుష్బూ!?
'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' అని కాకుండా రెండు రోజులూ 'జబర్దస్త్' పేరుతో ఈటీవీ ఛానల్లో ప్రసారం కానుంది. అయితే, జడ్జ్ సీటులో ఒక మార్పు చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా 'జబర్దస్త్' జడ్జ్ సీటులో ఇంద్రజ సందడి చేస్తున్నారు. ఆవిడతో పాటు కృష్ణ భగవాన్ సైతం తనదైన శైలిలో స్కిట్ మధ్యలో పంచ్ డైలాగ్స్ వేస్తూ నవ్విస్తున్నారు. ఆయన 'ఎక్స్ట్రా జబర్దస్త్'లోనూ ఉంటున్నారు. అయితే, ఇప్పుడు 'జబర్దస్త్'కు చిన్న గ్యాప్ ఇస్తున్నానని ఇంద్రజ తెలిపారు.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు


ఇంద్రజ (Indraja) గ్యాప్ ఇస్తున్నారా? లేదంటే రెండు రోజులూ (షోల్లో) ఖుష్బూను కంటిన్యూ చేస్తారా? అనేది చూడాలి. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లోనూ ఇంద్రజ చేసే సందడి వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరి, ఆ షోలో ఆవిడ వుంటారా? లేదంటే గ్యాప్ ఇస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే... ఆ రెండు షోస్ మల్లెమాల టీవీ ప్రొడ్యూస్ చేస్తున్న షోలే. 'జబర్దస్త్' షోలో టీమ్స్ కూడా అటు ఇటు అయ్యే ఛాన్స్ వుందట.


Also Readయాంకర్‌ కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీ!