Bad luck continues for Telugu anchor: బ్యాడ్ లక్... వెరీ బ్యాడ్ లక్... పాపం తెలుగు టీవీలో స్టార్ అన్పించుకున్న ఒక యాంకర్‌ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. టీవీ షోస్ అక్కర్లేదని, సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని ఎగిరి ఎగిరి పడిన యాంకర్ దిశ దశ బాలేక మళ్లీ టీవీకి రావాల్సిన సందర్భం ఏర్పడింది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రజెంట్ సైలెంట్‌గా టీవీ షోస్ స్టార్ట్ చేశాడు.


యాంకర్‌తో లవ్ అంటూ లైమ్ లైట్‌లోకి!
టీవీలో యాంకరింగ్ చేసి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ఆర్టిస్టులుగా సెటిలైన స్టార్లు వున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా సెన్సేషన్ 'పుష్ప 2'లో యాక్ట్ చేస్తున్న అనసూయ ఒకప్పుడు టీవీ స్టారే. ఝాన్సీ సైతం టీవీ షోస్ ద్వారా పాపులర్ అయ్యాక సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లో ట్రై చేసి ఫెయిల్ అయ్యాక టీవీలో పాపులర్ అయ్యి మళ్లీ సినిమాల్లోకి వచ్చింది రష్మీ. శ్రీముఖి సైతం టీవీ యాంకర్ ఇమేజ్ బేస్ చేసుకుని సినిమాలు చేస్తోంది. 'జులాయి'లో చెల్లి క్యారెక్టర్ చేసినా, ఇంకో సినిమా ఇంకో సినిమాలో పాపులర్ రోల్స్ వచ్చినా అందుకు కారణం టీవీ ఇమేజ్.


స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు వచ్చిన మేల్ యాంకర్స్ వున్నారు గానీ ఫిమేల్ యాంకర్స్ అంత సక్సెస్ రేట్ లేదు. మెజారిటీ యాంకర్స్‌కు కామెడీ చేసే రోల్స్ వస్తున్నాయి. సీరియస్ యాక్టర్స్ కాలేదు. ఒక్క శివాజీ మాత్రమే హీరోగా సక్సెస్ మీద సక్సెస్ కొట్టారు. ఆయన తర్వాత హీరోలుగా ట్రై చేసిన యాంకర్లు వున్నారు గానీ రీసెంట్‌గా లాస్ట్ టు త్రీ ఇయర్స్‌లో హీరోగా చేశాడో జబర్దస్త్ కమెడియన్.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు


టీవీల్లో అతడు యాంకర్ కమ్ కమెడియన్ కమ్ హోస్ట్! వెరీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్. అతడి ట్యాలెంట్ కంటే ఒక షోలో యాంకర్‌కి, అతడికి లవ్ ఎఫైర్ వుందని చేసిన హడావిడి ఎక్కువ లైమ్ లైట్‌లో వుండేలా చేసింది. వాళ్లిద్దరూ రెండు మూడు షోస్ చేశారు. టీవీ స్క్రీన్ మీద ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. కామెడీ కోసం అతడిని అలా ప్రాజెక్ట్ చేశారు. ఒక విధంగా అతడికి ఆ ఇమేజ్ మేలు చేసింది. సినిమాల్లో ఛాన్సులు తెచ్చింది.


ఫ్లాప్ టాక్ వచ్చినా ఫుల్ కలెక్షన్స్!
టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చిన యాంకర్‌కు ఛాన్సులు అయితే వచ్చాయి గానీ సక్సెస్‌లు రాలేదు. ఫస్ట్ కమెడియన్ రోల్స్ చేశాడు. నెక్స్ట్ హీరోగా టర్న్ అయ్యాడు. దాంతో టీవీని పక్కన పెట్టేశాడు. సోలో హీరోగా చేసిన ఒక సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఫుల్ కలెక్షన్స్ రావడంతో టీవీ వైపు చూసేది లేదన్నట్టు బిహేవ్ చేశాడు. కట్ చేస్తే నెక్స్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. థియేటర్స్ నుంచి రెండో రోజుకు ఎత్తేశారు. ఆ నెక్స్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదు. హీరో అంటూ వెయిట్ చేసి చేసి ఇప్పుడు టీవీ షోస్ చెయ్యడం స్టార్ట్ చేశాడు. ఓటీటీలో ఒక షో చేస్తున్నాడు. రీసెంట్‌గా పాపులర్ టీవీ ఛానల్‌లో మరొక షో స్టార్ట్ చేశాడు. 


ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ చేస్తూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశాడు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' మూవీ చేసినా టీవీని చిన్న చూపు చూడలేదు. షోస్ కంటిన్యూ చేస్తూ సినిమా చేశాడు. టీవీల్లోంచి సినిమాల్లోకి వచ్చే ఆర్టిస్టులు అతడిని ఎగ్జాంపుల్ తీసుకోవడం బెటర్.


Also Read: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?