Rashmika Mandanna Funny Answer: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం ‘గం గం గణేశా’. మే 31న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నలకు రష్మిక మందన్న ఫన్నీగా సమాధానాలు చెప్పింది. ఈవెంట్ లో పాల్గొన్న వారిందరినీ నవ్వించింది. ఇంతకీ ఆనంద్ ఏ ప్రశ్నలు అడిగాడు? రష్మిక ఏ సమాధానాలు చెప్పింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. 


ఆనంద్ ప్రశ్నలు - రష్మిక సమాధానాలు


ఆనంద్ దేవరకొండ: ఈ మధ్య ఇన్ స్టాలో మీ పెట్ డాగ్స్, క్యాట్ ఫోటోలు పెట్టారు కదా? మీకు ఇష్టమైన పెట్ పేరేంటి?


రష్మిక మందన్న: ఆరా నా ఫస్ట్ బేబీ, టామ్ నా సెకెండ్ బేబీ.


ఆనంద్ దేవరకొండ: మీరు బాగా ట్రావెల్ చేస్తారు. మీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి?


రష్మిక మందన్న: వియత్నాం నాకు ఇష్టమైన ప్రదేశం. చాలా గుడ్ మెమోరీస్ ఉన్నాయి.


ఆనంద్ దేవరకొండ: మీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు?


రష్మిక మందన్న: ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇట్ల స్పాట్లు పెడితే ఎట్లా?


ఆనంద్ దేవరకొండ: ఏదో ఒక పేరే చెప్పాలి.


రష్మిక మందన్న: రౌడీ బాయ్ నా ఫేవరెట్ కోస్టార్.


ఆనంద్ దేవరకొండ: మీకు వినాయకుడికి సంబంధించి ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా?


రష్మిక మందన్న: నేను దేవుడిని బాగా నమ్ముతాను. ఆలయాలకు వెళ్లడం, పూజలు చేయడం అంటే ఇష్టం. గణపతి పూజ రెగ్యులర్ గా ఇంట్లో చేస్తూనే ఉంటాం.


ఆనంద్ దేవరకొండ: మనకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు? ఎవరు బాగా ఫోటోలు తీస్తారు?


రష్మిక మందన్న: నేనే బెస్ట్ ఫోటోగ్రాఫర్. నేను చాలా ఫోటోలు తీసినా ఒక్కదానికీ క్రెడిట్ ఇవ్వలేదు.


ఆనంద్ దేవరకొండ: నా మెడ మీద ఉన్న టాటూ ఎవరిదో తెలుసా?


రష్మిక మందన్న: రష్మికనా?


ఆనంద్ దేవరకొండ: లేదు, నేను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి శ్రీవల్లి అని వేసుకున్నాను.


ఇక ఈ ఈవెంట్ లో రష్మిక మందన్న ఇచ్చిన రకరకాల ఎక్స్ ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరోవైపు రష్మిక నటించిన సినిమాల్లో తనకు ‘పుష్ప’, ‘యానిమల్’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు చాలా ఇష్టమని ఆనంద్ చెప్పాడు. అటు విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ బాగా నచ్చుతుందన్నాడు.



జూన్ 31న ‘గంగం గణేశా’ విడుదల


ఉదయ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగం గణేశా’ మూవీ జూన్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో వంశీ కారుమంచి నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. టెక్ ప్రొఫెషనల్ గా రాణిస్తున్న వంశీ తన మిత్రుడు కేదార్ సెలగం శెట్టితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  


Also Read: 'జబర్దస్త్'లో స్మాల్ ఛేంజ్ - జడ్జ్ సీటు నుంచి ఇంద్రజ అవుట్, అసలు కారణం అదేనా?