నందమూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. హీరోగా కళ్యాణ్ రామ్ 21వ చిత్రమిది. తెలుగు చిత్రసీమ గర్వించే కథానాయకుడు, వెండితెర వేల్పు ఎన్టీ రామారావు జయంతి (Sr NTR Birth Anniversary) సందర్భంగా ఈ సినిమా నుంచి 'Fist Of Flame' పేరుతో స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ లుక్కులో కనిపించారు. 


కళ్యాణ్ రామ్ కాస్ట్లీయస్ట్ ఫిల్మ్!
NKR21 Movie: కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ 21వ సినిమా మరో ఎత్తు అని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎట్ ప్రజెంట్... ఆయన కెరీర్‌లో కాస్ట్లీయస్ట్ ఫిల్మ్ ఇదేనని సమాచారం. భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. సాంకేతిక విలువల పరంగా, నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిసింది. 


NKR21 చిత్రాన్ని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Also Read: నా ఓటుకు రెండు వేలు ఇవ్వలేదు సార్... ఎమ్మెల్యేపై గద్దర్ కేసు






కీలక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి
ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన స‌యీ మంజ్రేక‌ర్ కథానాయికగా నటిస్తున్నారు. దీని సినిమా కంటే ముందు తెలుగులో అడివి శేష్ 'మేజర్', వరుణ్ తేజ్ 'గని', రామ్ పోతినేని 'స్కంద' సినిమాల్లో ఆమె నటించారు. కళ్యాణ్ రామ్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ అంటే... లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ విజ‌య‌శాంతి (Vijaya Shanthi) కీల‌క పాత్ర‌లో నటిస్తుండటం!


నందమూరి బాలకృష్ణ, విజయశాంతిది సూపర్ డూపర్ హిట్ పెయిర్. వాళ్లిద్దరూ కలిసి పలు విజయవంతమైన సినిమాలు చేశారు. 'సత్యం శివమ్' సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ చెల్లెలి పాత్ర చేశారు. అందులో శ్రీదేవి హీరోయిన్. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీలో మూడు తరాల హీరోలతో నటించిన కథానాయికల జాబితాలో ఆవిడ కూడా చేరనున్నారు.


Also Read: ఐదు నిమిషాలు ఇచ్చిన విజయ్ సేతుపతి 45 మినిట్స్ మాట్లాడారు - హీరో ఇంద్ర రామ్ ఇంటర్వ్యూ



శతాధిక చిత్ర కథానాయకుడు, నటుడు శ్రీకాంత్ సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సోహైల్ ఖాన్ మరో పాత్రలో కనిపించనున్నారు. 'కాంతార', 'మంగళవారం' సినిమాల ఫేమ్ బి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, విజ‌య‌శాంతి, స‌యీ మంజ్రేక‌ర్, శ్రీకాంత్, సోహైల్ ఖాన్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: బ్ర‌హ్మ క‌డ‌లి, ఛాయాగ్రహణం: సి. రామ్ ప్ర‌సాద్‌, సంగీతం:  బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌, స‌మ‌ర్ప‌ణ‌: ముప్పా వెంక‌య్య చౌద‌రి, నిర్మాణ సంస్థలు: అశోక క్రియేష‌న్స్‌ - ఎన్టీఆర్ ఆర్ట్స్‌, నిర్మాత‌లు: అశోక్ వ‌ర్ధ‌న్ ముప్పా - సునీల్ బ‌లుసు, ర‌చ‌న‌ - ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ చిలుకూరి