గురువారం వచ్చిందంటే చాలు... రాత్రి వేళల్లో టీవీలకు అతుక్కుపోయే తెలుగు ప్రజలు ఎందరో వున్నారు. అందుకు కారణం కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్'. ప్రతి వారం టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు తమ స్కిట్లతో, కామెడీతో నవ్విస్తున్నారు. తెలుగు ప్రజలను 'జబర్దస్త్' షో నవ్వించడంలో స్టేజి మీద కామెడీ చేసేవాళ్ళతో పాటు స్టేజి ముందు జడ్జ్ సీట్లలో ఉన్న పెద్దలు వేసే పంచ్ డైలాగులది కీలక పాత్ర. కొన్నాళ్లుగా జడ్జ్ సీటులో కూర్చుని ఎంటర్టైన్ చేస్తున్న ఇంద్రజ ఈ షోకి స్మాల్ గ్యాప్ ఇస్తున్నారు.


చిన్న గ్యాప్ అయితే తీసుకుంటున్నా!
''జబర్దస్త్'లో చిన్న గ్యాప్ అయితే తీసుకుంటున్నాను'' అని ఒకప్పటి కథానాయిక, నటి ఇంద్రజ చెప్పిన మాటల్ని షో నిర్వాహకులను లేటెస్ట్ ప్రోమోలో ఉంచారు. స్టేజి మీద ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'జబర్దస్త్'లో ఎంతో సన్నిహితుడు అయిన, తనను తల్లిలా చూసుకునే నూకరాజును ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. 


'జబర్దస్త్'కు దూరం కావడానికి కారణం అదేనా!?
'జబర్దస్త్' జడ్జ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా. కొన్నేళ్ల పాటు సుదీర్ఘంగా వాళ్లిద్దరూ ఆ షోలో సందడి చేశారు. వాళ్లను రీ ప్లేస్ చెయ్యడానికి 'జబర్దస్త్' నిర్వాహకులకు కొంత టైం అయితే పట్టింది. సింగర్ మనో నుంచి మొదలు పెడితే పలువుర్ని టెస్ట్ చేశారు. చివరకు, నటుడు కృష్ణ భగవాన్, ఇంద్రజ, ఖుష్బూలతో షోకి ఒక టెంపో తెచ్చారు. 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోల్లో ఇంద్రజ మార్క్ క్రియేట్ అయ్యింది. ఈ సమయంలో ఆవిడ షో నుంచి తప్పుకోవడం చిన్న అలజడి క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు



ఇంద్రజ చెన్నైలో సెటిల్ అయ్యారు. ఆమె ఫ్యామిలీ వుండేది అక్కడే. షో షూటింగ్ వున్నప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి వెళతారు. లేటెస్ట్ ప్రోమో చూస్తే... నూకరాజు చెప్పిన దాని ప్రకారం ఆవిడకు వచ్చే డబ్బులు తక్కువ అనుకోవాలి. ఇంద్రజ స్థానంలో వచ్చే కొత్త జడ్జ్ సెటిల్ అవ్వాలి. ఆమెలా స్పాంటేనియస్ పంచ్ డైలాగ్స్ వెయ్యాలి. కంటెస్టెంట్లు కూడా ఆమె మీద అంతే సరదాగా జోకులు వెయ్యాలి. కొత్త జడ్జ్ ఎవరో మరి? లేదంటే ఆల్రెడీ 'ఎక్స్ట్రా జబర్దస్త్' చేస్తున్న ఖుష్బూను తీసుకు వస్తారో? వెయిట్ అండ్ సి.


Also Readయాంకర్‌ కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీ!



వయసుకు తగ్గ క్యారెక్టర్... రాకెట్ రాఘవ మీద పంచ్!
'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో స్టార్టింగ్ స్కిట్, అందులో పంచ్ డైలాగ్ బాగా పేలిందని చెప్పాలి. 'రాకెట్' రాఘవ తన కుమార్తెకు పెళ్లి అని చెప్పగానే... ''హమ్మయ్య! మీ వయసుకు తగ్గ పాత్ర ఇప్పటికి చేస్తున్నారు'' అని ఇంద్రజతో పాటు సిరి హన్మంత్ సైతం పంచ్ వేసింది. ''నాకంటే కూడా ఇక్కడ వీళ్ళు అందరూ ఎక్కువ ఫీల్ అవుతున్నారు'' అని రాఘవ ఆశ్చర్యపోయాడు. ఈ ఎపిసోడ్ మే 30న టెలికాస్ట్ కానుంది. ప్రస్తుతానికి అదే ఇంద్రజ లాస్ట్ ఎపిసోడ్ కావచ్చు. మళ్లీ ఆవిడ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారో?