ది ఫారెస్ట్ (2016)లో విడుదలయిన అమెరికన్ హర్రర్ థ్రిల్లర్. ఒక భయానక అడవిలో మిస్సయిన తన చెల్లిని వెతుకుతూ.. ఆమె కవల సోదరి కూడా అక్కడికి వెళ్తుంది. మరి, ఆమె కూడా ఆ అడవిలో తప్పిపోతుందా? తన సోదరి ఆచూకీ తెలుసుకోగలుగుతుందా? ఆ అడవిలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటనేదే కథ.


ఇదీ.. కథ..


సారా, జెస్స్ ఇద్దరూ ట్విన్ సిస్టర్స్. జెస్స్ జపాన్ లోని ఒక స్కూల్‌లో టీచర్ గా పనిచేస్తుండేది. ఆమె స్కూల్ క్యాంప్‌లో భాగంగా ఒక ఫారెస్ట్ దగ్గర ఉన్న పర్వతం వద్దకు వెళ్తుంది. అయితే, ఆమె దారి తప్పుతుంది. తిరిగి స్కూల్ క్యాంప్‌కు చేరుకోలేదు. ఆ ప్రాంతాన్ని అవోకిగహారా అంటారు. ఇది జపాన్‌లో మౌంట్ ఫూజి దగ్గర ఉంటుంది. ఇందులోకి సూసైడ్ చేసుకునేవాళ్లు వెళ్తారు. జెస్స్ ఆ ఫారెస్ట్ లోకి వెళ్లింది కాబట్టి ఆమె చనిపోయి ఉండొచ్చు అని సారాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తాడు.


అయితే, సారా ఇందుకు ఒప్పుకోదు. తన సోదరికి ఏమైనా జరిగితే తనకు తెలుస్తుందని, ఒక ఫీల్ కలుగుతుందని అంటుంది. ఆమె బతికే ఉందనే బలమైన నమ్మకంతో సారా తన సిస్టర్‌ను వెతకటానికి జపాన్ వస్తుంది. ముందు జెస్స్ పనిచేసిన స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్ ని కలుస్తుంది. అక్కడ ఒక స్టూడెంట్ సారాను చూసి దెయ్యం అనుకొని భయపడుతుంది.


ఒకప్పుడు తినటానికి తిండి కరువై, ఇంట్లో ముసలివాళ్లను, వికలాంగులను ఆ ఫారెస్ట్‌లో వదిలేసేవారు. వారంతా ఆకలితో చనిపోయి, కోపంతో దెయ్యాలై తిరిగివచ్చేవారు అని ఆ ఫారెస్ట్ స్టోరీ ప్రిన్సిపల్ సారాకు చెప్తుంది. ఆ రోజు సాయంత్రం హోటల్ దగ్గర సారా.. ఐడెన్ అనే అమేరికన్ జర్నలిస్ట్ ని కలుస్తుంది. వాళ్లిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. సారా వాళ్ల పేరెంట్స్ ని చిన్నపుడు వాళ్ల తాగుబోతు డ్రైవర్ యాక్సిడేంటల్ గా చంపేశాడని చెప్తుంది. అది తన సిస్టర్ జెస్స్ కళ్లారా చూసిందని, తను మాత్రం కళ్ళు మూసుకున్నానని అంటుంది. కానీ, ఆ హత్య చేసేది డ్రైవర్ కాదు. సారా వాళ్ల తండ్రి.. ఆమె తల్లిని చంపేసి, తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు.


ఐడెన్ తన డాక్యూమెంటరీ కోసం సారా హెల్ప్ కావాలని, ఒక గైడ్‌ను ఏర్పాటు చేసుకొని ఆ ఫారెస్ట్ లోకి వెళ్దామని ప్లాన్ చేస్తాడు. ఫారెస్ట్ దగ్గర జెస్స్ స్టే చేసిన హోటల్‌లో రిసెప్షనిస్ట్ ని కనుక్కోవటానికి వెళ్లినపుడు ఆమె మార్చురీకి తీసుకెళ్లి అక్కడున్న శవాల్లో జెస్స్ ఉందేమో చూడమంటుంది. చూస్తే అదొక భయంకరమైన రూపంతో ఉన్న శవం కానీ అది జెస్స్ కాదు. సారా ఫారెస్ట్ లోకి వెళ్లటానికి నిర్ణయించుకుంటుంది. అక్కడ ఉన్న ఓ స్థానిక యువతి ఈ అడవి బాధగా ఉన్నవాళ్లతో ఆడుకుంటుంది. మాయ సృష్టించి లేనివి ఉన్నట్టు నమ్మేలా చేస్తుందని చెప్తుంది.


ఐడెన్, ఆ పార్క్ గైడ్, సారా ముగ్గురూ ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్తారు. అక్కడి నుంచి అనుకోని విధంగా ఆ ఫారెస్ట్ ఇల్యూషన్స్ సృష్టిస్తుంది. చేయి దాటిపోయే వరకు సారాకు నిజాలు తెలియవు. చివరికి జెస్స్ దొరికిందా? ఆమె కూడా ఈ ఫారెస్ట్ మాయకు బలి అయిపోయిందా? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా Netflixలో స్ట్రీమ్ అవుతోంది.