లావుగా ఉండే సారా అనే ఒక అమ్మాయి ఫ్రెండ్స్ తనను పంది పిల్ల అంటూ ఆటపట్టిస్తుంటారు. ఒక సైకో కిల్లర్ సారాను ఏడిపిస్తున్న తన ఫ్రెండ్స్ మీద అటాక్ చేస్తాడు. ఇప్పుడు సారా తనకు హెల్ప్ చేస్తున్న సైకో కిల్లర్ ను సపోర్ట్ చేస్తుందా? లేదా తన ఫ్రెండ్స్ ను కాపాడుకుంటుందా అన్నది సినిమాలో ట్విస్ట్. అన్నట్టు.. ఈ మూవీ పేరు పిగ్గీ (Piggy). ఈ స్పానిష్ మూవీ 2022లో విడుదలైంది.


కథ ఏమిటంటే..


స్పెయిన్ లోని ఒక చిన్న ఊర్లో సారా అనే టీనేజ్ అమ్మాయి ఉంటుంది. ఇల్లు, స్కూల్ తప్ప వేరే ఎక్కడికి వెళ్ళనీయకుండా సారా వాళ్ల అమ్మ ఆమెను స్ట్రిక్ట్ గా పెంచుతుంది. అప్పుడపుడు సారా వాళ్ళ నాన్న నడిపే మటన్ కొట్టులో పని చేస్తుంటుంది. సారాకు తన ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్లి సరదాగా గడపాలని ఉంటుంది. తన ఫ్రెండ్స్ మాత్రం ఆమె లావుగా ఉందని పంది పిల్ల అని వెక్కిరిస్తూ వాళ్ళతో కలవనీయరు. తనని పందిపిల్ల అని ఏడిపించే తన ఫ్రెండ్స్ రోసీ, క్లాడియా, మాకా ఈ ముగ్గురిలో క్లాడియా ఒకప్పుడు సారా బెస్ట్ ఫ్రెండ్. ఆమె కూడా మిగిలిన వారితో చేరి, సారాను ఏడిపించటంతో సారా బాధపడుతుంది.


ఒకరోజు సారా మధ్యాహ్నం స్విమ్మింగ్ పూల్ లో ఎవరూ లేని సమయంలో వెళ్లి స్విమ్ చేయాలనుకుంటుంది. ఆ పూల్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. కానీ అంతగా తనని పట్టించుకోడు. సారా పూల్ దగ్గర కనపడగానే ఆ ముగ్గురు అమ్మాయిలు వచ్చి, మళ్లీ టీజ్ చేస్తూ ఉంటారు. వాళ్ల మాటలు వినపడకుండా నీళ్లలో చాలాసేపు మునిగి ఉంటుంది సారా. వాళ్లు సారా దుస్తులను తీసుకొని వెళ్లిపోతారు. అప్పుడు సారా చాలా అవమానపడుతూ అలాగే రోడ్ మీద లో దుస్తులతో పరిగెడుతుంది.


ముగ్గురు వ్యక్తులు కార్ లో వెళ్తూ సారాను టీజ్ చేస్తారు. ఇంతలో అటువైపు నుంచి ఒక వ్యాన్ వెళ్తుంటుంది. అది పూల్ దగ్గర కనిపించిన సైకో కిల్లర్ వ్యాన్. ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి క్లాడియా గాయాలతో ఆ వ్యాన్ లో కనిపిస్తుంది. హెల్ప్ చేయమని అరుస్తుంటుంది. ఇంతలో ఆ వ్యక్తి వ్యాన్ ఆపగానే సారా భయంతో వణికిపోతుంది. ఆ వ్యక్తి ఒక టవల్ కింద పడేసి వెళ్లిపోతాడు. సారా ఆ టవల్ కప్పుకొని ఇంటికి పరిగెడుతుంది. మధ్యలో ఒక పోలీస్ ఏమైనా సమస్యా? అని అడిగినా వినిపించుకోకుండా వెళ్తుంది. 


మరుసటి రోజు ఆ ముగ్గురు అమ్మాయిలు కిడ్నాప్ అయిన విషయం అందరూ మాట్లాడుకుంటారు. సారా వాళ్ల అమ్మ నువ్వు ఆరోజు పూల్ దగ్గరికి వెళ్లినపుడు ఏం జరిగిందని అడుగుతుంది. నేనసలు పూల్ కి వెళ్లలేదు. చెరువుకు వెళ్లి స్విమ్మింగ్ చేసానని అబద్ధం చెప్తుంది. ఆ టవల్ ఎక్కడిది అని అడిగితే, మార్కెట్ కి వెళ్లినపుడు కొన్నానని చెప్తుంది. సారా ఫోన్ మిస్ అవటం చూసుకొని వెతుక్కుంటూ వెళ్తుంది. కిడ్నాప్ అయినవారిని వెతకటానికి అక్కడికి కొందరు వస్తారు. వారికి కనపడకుండా, ఆ సైకో కిల్లర్ సారాను కాపాడుతాడు. అతనికి సారా అంటే ఇష్టం. 


పోలీస్ స్టేషన్ లో పోలీసులు సారాను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. సారా మొత్తం చెప్పేస్తుంది. కానీ ఈ సైకో కిల్లర్ వాళ్లని కిడ్నాప్ చేసి, తనని కాపాడిన విషయం మాత్రం చెప్పదు. ఇంటికి వచ్చాక, మొత్తం విషయం సరిగ్గా చెప్పు, అసలు నువ్వేం చేసావు అని సారాను తిడుతూ, కొడుతూ ఉంటుంది. ఇంతలో ఆ సైకో కిల్లర్ ఆ గదిలోనే ఉండి, వాళ్లమ్మ మీద చేయి చేసుకొని సారాను తీసుకెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ కట్టి పడేసి ఉంటారు. ఇప్పుడు సారా ఏం చేస్తుంది అనేది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.



Also Read: కారు డిక్కీలో చెయ్యి.. జుట్టు కోసం అమ్మాయిలను ఎత్తుకుపోయే కిల్లర్ - సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్లర్ మూవీ ఇది