ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం పొడిగింపు


ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు 6 నెలల పాటు పదవీ కాలం పొడిగిస్తూ డీవోపీటీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సీఎస్‌గా నీరభ్ కుమార్ జూన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో ఇటీవల ప్రభుత్వం ఆయన సర్వీసు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసింది. ఇంకా చదవండి


పుంగనూరులో టీడీపీలో చేరిపోతున్న వైసీపీ క్యాడర్


వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన పుంగనూరులో చాలా స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పుంగనూరు వైసీపీ కార్యకర్తలు, నేతలు టీడీపీలో చేరిపోతున్నారు. పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన  పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్‍బాషాతోపాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు.  పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు ఆధ్వర్యంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకున్నారు.  మొత్తం 31 మంది సభ్యులు ఉన్న మున్సిపాలిటీలో 25 మందికి పైగా కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా చదవండి


సీతారామా ప్రాజెక్టు ట్రయల్‌ రన్ విజయవంతం


ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇవాళ నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. ప్రాజెక్టులోని మొదటి పంపు నుంచి గోదావరి జలాలను ట్రయల్ రన్‌లో విడిచి పెట్టారు. ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి ప్రారంభించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ముందస్తుగా ట్రయల్ నిర్వహించింది. ఇంకా చదవండి


మంత్రివర్గంలో ఖాళీలు లేవు- రేవంత్ కీలక ప్రకటన


తెలంగాణ ప్రస్తుతానికి మంత్రిమండలిలో ఖాళీలు లేవని తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో అధినాయకత్వంతో మంత్రివర్గ విస్తరణ ముచ్చటే లేదన్నారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై కూడా రేవంత్ తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీని ఏదోలా నాశనం చేయాలని చాలా మంది చూస్తున్నారని ఆరోపించారు. ఇంకా చదవండి


తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ డైలమా


తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఓ పవర్ ఫుల్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికార  పార్టీతో పోటీ పడి ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ ఎక్కడో అట్టడుగున మూడో స్థానంలో నిలిచింది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ అంతా బీజేపీ వైపు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.  ఇలాంటి సమయంలో బీజేపీకి నేతృత్వం వహించడానికి చాలా మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.  రేసులో ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉన్నారని అనుకున్నారు. కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడంతో స్టేట్ బీజేపీ చీఫ్ పోస్ట్ ఇస్తారని ఆశపెట్టుకున్నారు. కానీ నిన్నామొన్న వచ్చిన ఈటల ఎందుకని తాము లేమా అని ఇతర నేతలు ముందుకు వస్తున్నారు. ఫలితంగా బీజేపీలో అంతర్గత రాజకీయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇంకా చదవండి