HDFC Bank Manager Died Due To Heart Attack In UP: ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. కొందరు కూర్చున్న చోటనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనే తాజాగా యూపీలో (UP) జరిగింది. విధుల్లో ఉన్న ఓ బ్యాంక్ మేనేజర్ గుండెపోటుతో అకస్మాత్తుగా సీట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. యూపీ మహోబా జిల్లాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) మేనేజర్ రాజేష్ షిండే (38) ఎప్పటిలానే బ్యాంకులో విధుల్లో నిమగ్నమయ్యాడు. అయితే, ఉన్నట్టుండి గుండెపోటుతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై సీట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి. అప్పటివరకూ తమతో పని చేసిన వ్యక్తి ఇలా ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో తోటి ఉద్యోగులు ఆందోళన చెందారు.




Also Read: Gas Cylinder Leakage: గ్యాస్ సిలిండర్‌ లీక్ అయితే వెంటనే ఇలా చేయండి, లేకపోతే ఇల్లు పేలిపోతుంది