ఒకటో తేదీనే జీతాలు అన్నారు, ఎక్కడ?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి.. 22 రోజులు గడుస్తున్నా జీతాలు రాక అంగన్వాడీలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 'ఉద్యోగులు నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి జీతాలు చెల్లించాలి.' అని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఇంకా చదవండి
ఏపీలో మరో కూటమి
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో బీజేపీ కూడా చేరేందుకు సిద్ధమవుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో కూటమిలో చేరడంపై స్పష్టత రానుంది. ఆ తరువాత సీట్లను మూడు పార్టీలు పంచుకోనున్నాయి. ఇప్పటికే ఒక కూటమి ఏర్పాటు కాగా.. మరో కూటమి ఏర్పాటుకు రాష్ట్రంలో చాప కింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశంలో ప్రధాని మోదీని గద్దె దించేందుకు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డ పార్టీలు.. ఇక్కడ మరో కూటమికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇంకా చదవండి
కాంగ్రెస్ 'ఛలో సెక్రటేరియట్' ఉద్రిక్తత
ఏపీ ప్రభుత్వం దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో సెక్రటేరియట్' (Chalo Secratariat) నిరసన గురువారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. విజయవాడ (Vijayawada) ఆంధ్ర రత్న భవన్ లో షర్మిల ఉన్న చోటకు గురువారం ఉదయం చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆమెను ఆ భవన్ లోనే నిర్బంధించారు. ఆమె బయటకు రాకుండా భారీగా మోహరించారు. దీంతో పార్టీ అభిమానుల నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మస్తాన్ వలి, తులసిరెడ్డి, రుద్దరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా చదవండి
ఏడు జాబితాల్లో ఉన్న వారికీ నో గ్యారంటీ
కొడాలి నానికి గుడివాడలో టిక్కెట్ లేదంటూ జరిగిన ప్రచారం ఏపీ వ్యాప్తంగా హైలెట్ అయింది. ఆయనను గన్నవరం పంపుతున్నారని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని లాంటి లీడర్ కే ఈ పరిస్థితి ఉంటే.. పార్టీలో మరే నేతకూ టిక్కెట్ గ్యారంటీ లేనట్లే. ఈ గందరగోళం సుదీర్ఘంగా సాగుతోంది. జాబితాలు ప్రకటించిన వారికి టిక్కెట్ కన్ఫర్మ్ అని చెప్పడం లేదు. వారి స్థానాల్లోనూ రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఇంకా చదవండి
వైసీపీ వైపు జలీల్ ఖాన్ చూపు
విజయవాడ టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ లీడర్ జలీల్‌ఖాన్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు వైసీపీ లీడర్లతో కూడా ఆయన చర్చలు జరిపిన ఫొటోలు బయటకు వచ్చాయి. టీడీపీ ఫ్లెక్సీలను జలీల్‌ఖాన్ తొలగించడం చర్చనీయాంశమైంది. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న జలీల్‌ఖాన్ వైసీపీ లీడర్లతో చర్చలు జరిపారు. రాత్రి ఆయన ఇంటికి వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెళ్లి మాట్లాడారు. అనంతరం జలీల్‌ఖాన్ టీడీపీ బ్యానర్లు తొలగించారు. ఇంకా చదవండి